WTC Final Prize Money: టెస్టు చాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ డీటెయిల్స్.. విజేతకు ఎంతో తెలుసా? డ్రా అయితే!!

WTC Final Prize Money విజేతకు USD 1.6 Million, Draw అయితే.. | ICC || Oneindia Telugu

దుబాయ్: సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనున్న ఈ మెగా సమరం కోసం అభిమానులే కాకుండా ప్లేయర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు అత్యుత్తమ జట్ల పోరాటం చూసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఇక ఐసీసీ సీఈఓ జియోఫ్ అలార్డిస్ సోమవారం టెస్టు చాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ వివరాలను తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11 కోట్ల 71 లక్షల 77 వేలు) అందనున్నాయి.

ఫైనల్ డ్రా అయితే

ఫైనల్ డ్రా అయితే

డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు 1.6 మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తున్నట్లు ఐసీసీ సీఈఓ జియోఫ్ అలార్డిస్ తెలిపారు. రన్నరప్‌కు 0.8 మిలియన్ డాలర్లు (రూ. 5 కోట్ల 85 లక్షల 88 వేలు) అందనున్నాయి. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే.. బహుమతి డబ్బును ఇద్దరు ఫైనలిస్టులు (భారత్, న్యూజిలాండ్‌) పంచుకోనున్నారు. మూడో స్థానంలోని జట్టుకు రూ. 3 కోట్ల 29 లక్షల 57 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన టీంకు రూ. 2 కోట్ల 56 లక్షల 33 వేలు, ఐదవ స్థానంలో జట్టుకు రూ. కోటి 46 లక్షల 47 వేల ప్రైజ్ మనీ దక్కనుంది. డబ్ల్యూటీసీలోని మిగతా జట్లకు 73 లక్షల 23 వేలు అందనున్నాయి.

జూన్ 23న రిజర్వ్‌డే

జూన్ 23న రిజర్వ్‌డే

సౌతాంప్టన్‌లోని ఏజీస్ బౌల్ మైదానం వేదికగా టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌కు ఐసీసీ జూన్ 23ని రిజర్వ్‌డేగా కేటాయించింది. ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో కోల్పోయిన ఆటను చివరి రోజు ఆడించనున్నారు. అయితే దీనిపై ఐదో రోజు చివరి గంటలో మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకోనున్నాడు. ఆట అవసరమని భావిస్తేనే రిజర్వ్‌డేను ఉపయోగించుకుంటారు. ఒకవేళ ఫలితం తేలని పరిస్థితిల్లో మ్యాచ్‌గా డ్రాగా పరిగణించి ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ఇక భారత కాలమానం ప్రకారం సాయంత్ర 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. స్టార్ నెట్‌వర్క్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు చానెల్స్‌లో కూడా మ్యాచ్‌‌ను వీక్షించవచ్చు.

ముఖాముఖి రికార్డ్స్

ముఖాముఖి రికార్డ్స్

టెస్ట్ క్రికెట్‌లో ఇరు జట్ల ముఖా ముఖి పోరు రికార్డులు గమనిస్తే కోహ్లీసేనదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 59 మ్యాచ్‌లు ఆడగా.. టీమిండియా 21 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలవగా.. 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. విరాట్ కోహ్లీకి కివీస్ జట్టుపై మెరగైన రికార్డు ఉంది. విరాట్ కివీస్‌పై 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 773 రన్స్ చేశాడు.

న్యూజిలాండ్‌లో రాస్ టేలర్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. అతను 812 రన్స్ చేశాడు. అయితే గతేడాది ఆరంభంలో న్యూజిలాండ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో భారత్ చిత్తుగా ఓడింది. ఇక ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌పై టీమిండియాకు చెత్త రికార్డు ఉంది.

French Open 2021: వ్యూహాలు చెబుతూ.. జకోవిచ్‌కే కోచింగ్‌ ఇచ్చిన కుర్రాడు!!

టీమిండియా ముమ్మర సాధన

టీమిండియా ముమ్మర సాధన

టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ కోసం టీమిండియా ముమ్మరంగా సిద్ధ‌మవుతోంది. ప్ర‌స్తుతం భారత జట్టు స‌భ్యులే రెండుగా విడిపోయి మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ మూడో రోజుల హైలైట్స్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమ‌వారం షేర్ చేసింది. రవీంద్ర జ‌డేజా 76 బంతుల్లో 54 ప‌రుగులు చేశాడు.

మొహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోచ్ ర‌విశాస్త్రి ప్లేయ‌ర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ప‌రిశీలించాడు. తొలి రెండు రోజుల్లో రిష‌బ్ పంత్ సెంచ‌రీ (94 బంతుల్లో 121), శుభ్‌మ‌న్ గిల్ 85 ప‌రుగులు చేయగా.. ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ జట్టుపై టెస్ట్ సిరీస్ గెలిచిన కివీస్ కూడా త్వరలో ప్రాక్టీస్ ఆరంబించనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 14, 2021, 18:23 [IST]
Other articles published on Jun 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X