Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్మప్ మ్యాచ్: కేఎల్ రాహుల్, ధోని సెంచరీలు, బంగ్లా టార్గెట్ 360

ICC World Cup Warm-up Cricket Match 2019 in Cardiff: Dhoni, Rahul Tons Take India to 359/7

హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 99 బంతుల్లో 108(12 ఫోర్లు, 4 సిక్సులు), మహేంద్ర సింగ్ ధోని 78 బంతుల్లో 113(8 ఫోర్లు, 7 సిక్సులు) సెంచరీలతో చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 359 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 360 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(1) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 50 పరుగుల వద్ద మరో ఓపెనర్ రోహిత్ శర్మ 42 బంతుల్లో 19(ఒక ఫోర్) నిరాశపరిచాడు. దీంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ నిలకడగా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు.

ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌తో స్కోరు బోర్డుని నడిపించే క్రమంలో కోహ్లీ 46 బంతుల్లో 47(5 ఫోర్లు) సైఫుద్దీన్‌ వేసిన యార్కర్‌కు ఔటయ్యాడు. అనంతరం కేఎల్ రాహుల్99 బంతుల్లో 108(12 ఫోర్లు, 4 సిక్సులు) ధోనితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు.

22 ఓవర్లకు 102/4 స్థితిలో ఉన్న స్కోరు బోర్డుని 44 ఓవర్లకు 268/5 పరుగులకు చేర్చారు. ఈ క్రమంలో ధోని కూడా సెంచరీని నమోదు చేశాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ధోని ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. దీంతో 73 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా 11 బంతుల్లో 21(2 ఫోర్లు, సిక్సు)తో ఫరవాలేదనిపించాడు.

ఈ వరల్డ్ కప్‌లో నాలుగో స్థానం కోసం ఎంపిక చేసిన విజయ్ శంకర్(2), దినేశ్‌ కార్తీక్‌ (7) నిరాశపరిచారు. కాగా, బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ ఉల్ హాసన్, రూబెల్ హాసన్ చెరో రెండు వికెట్లు తీయగా... షబ్బీర్ రెహ్మాన్, సైఫుద్దీన్, ముస్తాఫిర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Tuesday, May 28, 2019, 20:02 [IST]
Other articles published on May 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+