Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్మప్ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలం: 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్

ICC World Cup Warm Up Cricket Match 2019 at London: Kohli Out For 18

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్ సన్నాహాకంలో భాగంగా కెన్నింగ్‌టన్ ఓవెల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత్ 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌లు విఫలమయ్యారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ శర్మ(2) ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో భారత జట్టు మూడు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో శిఖర్ ధావన్(2) టామ్ బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా పది పరుగులకే టీమిండియా రెండు ప్రధాన వికెట్లను నష్టపోయింది.

ఆ వెంటనే లోకేశ్ రాహుల్(6) బోల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, కేఎల్‌ రాహుల్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. దాంతో వరల్డ్‌కప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఎవరు వస్తారనే దానిపై తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌తో జట్టు మేనేజ్‌మెంట్ తేల్చేసింది.

అయితే, ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ గ్రాండ్‌హోం వేసిన 11వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ(18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.

Story first published: Saturday, May 25, 2019, 16:26 [IST]
Other articles published on May 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+