వార్మప్ మ్యాచ్‌లో రాణించిన కివీస్ బౌలర్లు: భారత్ 179 ఆలౌట్

హైదరాబాద్: ఐసీసీ ప్రపంచకప్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని ఆశించిన కోహ్లీసేనకు నిరాశే ఎదురైంది. కెన్నింగ్‌టన్ ఓవెల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 179 పరుగులకే కుప్పకూలింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మ(2) ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో భారత జట్టు మూడు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది.
పది పరుగులకే టీమిండియా రెండు వికెట్లు
ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో శిఖర్ ధావన్(2) టామ్ బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా పది పరుగులకే టీమిండియా రెండు ప్రధాన వికెట్లను నష్టపోయింది. ఆ వెంటనే లోకేశ్ రాహుల్(6) బోల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.

నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్
దాంతో వరల్డ్‌కప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఎవరు వస్తారనే దానిపై తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌తో జట్టు మేనేజ్‌మెంట్ తేల్చేసింది. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు.

18 పరుగులకే కోహ్లీ ఔట్
కానీ గ్రాండ్‌హోం వేసిన 11వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ(18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ.. హార్థిక్‌తో కలిసి స్కోర్ పెంచేందుకు పోరాడాడు. అయితే, ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో తొలి బంతికి హార్థిక్(30) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో దినేశ్ కార్తీక్(4) సోదీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

నాలుగు వికెట్లు తీసిన బౌల్ట్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు చేశాడు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్ భువనేశ్వర్ కుమార్(1), కుల్దీప్ యాదవ్(19), షమీ(2 నాటౌట్) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. దీంతో భారత్ 39.2 ఓవర్లలో 179 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కివీస్ బౌలింగ్‌లో బౌల్ట్ నాలుగు, నీశమ్ మూడు, సౌతీ, గ్రాండ్‌హోం, ఫెర్గుసన్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications