Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా టీమ్ విశ్లేషణ: స్మిత్, వార్నర్ రాకతో జట్టు ఎంపిక సవాల్‌గా!

ICC World Cup: Team analysis: Australia: Dont write off the champions!

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌ను కొన్ని ఏళ్ల పాటు శాసించింది. ఇప్పటివరకు జరిగిన పదకొండు వరల్డ్‌కప్‌ల్లో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. వరుసగా నాలుగు సార్లు వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరింది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 12వ ఎడిషన్‌లో కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

కాగా, గతేడాది బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా చరిత్ర మసకబారింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించడంతో ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుస ఓటములతో సతమతమైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆ జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది.

ఎంతలా అంటే ఆస్ట్రేలియా జట్టు ఆడిన 28 వన్డేల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో కూడా ఆస్ట్రేలియా ర్యాంకు దిగజారింది. కానీ, వరల్డ్‌కప్‌కు ముందు ఆ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. భారత పర్యటనలో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడినా ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో 3-2తో వన్డే సిరి‌స్‌ను నెగ్గింది.

ఆ తర్వాత పాకిస్థాన్‌తో దుబాయి వేదికగా జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ రెండు సిరిస్ విజయాలు ఆసీస్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. మరోవైపు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తిరిగి ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా జూన్‌ 1న అఫ్ఘాన్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఆస్ట్రేలియా బలాలు

ఆస్ట్రేలియా బలాలు

వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆస్ట్రేలియాకు అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. అన్నింటికీ మించి పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగి ఉంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఫామ్‌లో ఉండటం... ఓపెనర్‌ ఖవాజా ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌ విభాగంలో కమిన్స్‌, స్టార్క్‌, జై రిచర్డ్‌సన్‌, నాథన్ కౌల్టర్ నైల్‌, బెహ్రెన్‌డార్ఫ్‌... స్పిన్నర్లు ఆడమ్ జంపా, నాథన్ లియాన్‌ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆస్ట్రేలియా బలహీనత

ఆస్ట్రేలియా బలహీనత

ఏడాదిపాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌ పూర్తిగా వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. వీరికి తగినంత ప్రాక్టీస్ లేకపోవడం జట్టును ఆందోళనపరుస్తోంది. అయితే, వీరిద్దరూ ఐపీఎల్‌లో రాణించినప్పటికీ వన్డేల్లో ఎలా ఆడతారో వేచి చూడాలి. ఇక, ఐసీసీ లాంటి మెగా టోర్నీల్లో ఆసీస్ బౌలర్లు నిప్పులు చెలరేగుతారు. అయితే మిచెల్ స్టార్క్ గాయం జట్టుని వేధిస్తోంది.

కీలక ఆటగాడిగా డేవిడ్ వార్నర్

కీలక ఆటగాడిగా డేవిడ్ వార్నర్

నిషేధం పూర్తైన తర్వాత డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లు తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడంతో తుది జట్టును ఎంపిక జట్టు మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ విజృంభించాడు. ఐపీఎల్‌లో మొత్తం 12 మ్యాచ్‌లాడిన వార్నర్ 692 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి.

వరల్డ్‌కప్‌లో ఆసీస్ గత ప్రదర్శన

వరల్డ్‌కప్‌లో ఆసీస్ గత ప్రదర్శన

విన్నర్స్: 1987, 1999, 2003, 2007, 2015.

రన్నర్స్: 1975, 1996.

వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు

వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు

ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అలెక్స్‌ క్యారీ, షాన్‌ మార్ష్‌, మిచెల్‌ స్టార్క్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, మార్కస్‌ స్టొయినిస్‌, ఆడమ్‌ జంపా, జై రిచర్డ్‌సన్‌, నాథన్‌ కల్టర్‌ నైల్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియాన్‌.

Story first published: Wednesday, May 22, 2019, 12:33 [IST]
Other articles published on May 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+