For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర రివర్స్, 130 పరుగులతో సౌతాఫ్రికాపై భారత్ గెలుపు

By Srinivas

మెల్‌బోర్న్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మెల్ బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 130 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. దీనిని చేధించే క్రమంలో సౌతాఫ్రికా 177 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా పైన సచిన్ తర్వాత సెంచరీ సాధించింది ధావనే. అతను 137 పరుగులు చేశాడు.

Cricket

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో... ఆమ్లా 22, డికాక్ 7, డుప్లెసిస్ 55, డివిల్లీర్స్ 30, మిల్లర్ 22, డుమినీ 6, పార్నెల్ 17, పిలాండర్ 0, స్టెయిన్ 1, మోర్కెల్ 2, ఇమ్రాన్ తాహిర్ 8 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో... అశ్విన్ 10 ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షమి 8 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, శర్మ 7 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 2వికెట్లు, జడెజా 8.2 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఉమేష్ యాదవ్ 6 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. రైనా ఒక ఓవర్ వేసి 3 పరుగులు ఇచ్చాడు.

భారత బ్యాట్స్‌మెన్‌లలో... రోహిత్ శర్మ 0, ధవన్ 137 (136 బంతుల్లో), కోహ్లీ 46 (60 బంతుల్లో), రహానే 79 (60 బంతుల్లో) రైనా 6, ధోనీ 18, జడెజా 2, అశ్విన్ 5 (నాటౌట్), షమీ 4 (నాటౌట్) పరుగులు చేశారు. రహానే ఎల్బీగా వెనుదిరగగా, రోహిత్ శర్మ, జడెజాలు రనౌట్ అయ్యారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో... మోర్కెల్ 2, స్టెయిన్, తాహిర్, పార్నెల్‌లు చెరో వికెట్ తీశారు.

సౌతాఫ్రికా చివరి వికెట్ (పదో వికెట్) కోల్పోయింది. జడెజా బౌలింగులో ఇమ్రాన్ తాహిర్ అవుటయ్యాడు. తాహిర్ 10 బంతుల్లో 8 పరుగులు చేశాడు.

ఆ వెంటనే అశ్విన్ బౌలింగులో మోర్కెల్ అవుటయ్యాడు. మోర్కెల్ 5 బంతుల్లో రెండు పరుగులు చేశాడు.

షమీ బౌలింగులో స్టెయిన్ అవుటయ్యాడు. 7 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. షమీ బౌలింగులో ధావన్ క్యాచ్ పట్టాడు.

34 ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా 153 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. భారత్ తరఫున అశ్విన్ రెండు వికెట్లు, శర్మ రెండు వికెట్లు, షమీ ఒక వికెట్ తీశారు.

మిల్లర్ 23 బంతుల్లో 22 పరుగులు తీశాడు. అందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత పిలాండర్‌ను అశ్విన్ ఎల్బీడబ్ల్యుగా వెనక్కి పంపించాడు. ఇతను డకౌట్ అయ్యాడు.

బౌలింగులో అశ్విన్ సత్తా చాటుతున్నాడు. 34 ఓవర్లో ఆరో బంతికి పిలాండర్‌ను ఎల్బీడబ్ల్యుగా పంపించాడు. అంతకుముందు నాలుగో బంతి వేసినప్పుడు మిల్లర్ రనౌట్ అయ్యాడు.

147 పరుగుల వద్ద సౌతాఫ్రికా 5వ వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగులో డుమినీ రైనాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. డుమిని 15 బంతుల్లో 6 పరుగులు చేశాడు.

సౌతాఫ్రికా జట్టు స్కోర్ 133 వద్ద ఉన్నప్పుడు నాలుగో వికెట్ పోయింది. డుప్లెసిస్ 71 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అందులో ఐదు ఫోర్లు ఉన్నాయి. శర్మ బౌలింగులో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి డుప్లెసిస్ అవుటయ్యాడు.

సౌతాఫ్రికా జట్టు పరుగులు 108 వద్ద ఉన్నప్పుడు డివిల్లియర్స్ అవుటయ్యాడు. అతను 38 బంతుల్లో 30 పరుగులు చేశాడు. జడెజా బౌలింగులో రనౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికాకు ఇది మూడో వికెట్.

వెస్టిండీస్ 20 ఓవర్లకు 92 పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది.

సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగులో షమీ క్యాచ్ పట్టడంతో ఆమ్లా అవుటయ్యాడు. ఆమ్లా 28 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి.

ఆదిలోనే వికెట్ పడటంతో దక్షిణాఫ్రికా ఆచితూచి ఆడుతోంది. ఆమ్లా 24 బంతుల్లో 16, డుప్లెసిస్ 18 బంతుల్లో 5 పరుగులతో ఉన్నారు.

ఆదిలోనే డికాక్ అవుటయ్యాడు. షమీ బౌలింగులో కోహ్లీ క్యాచ్ పట్టాడు. డికాక్ 15 బంతుల్లో 7 పరుగులు చేశాడు. నాలుగు ఓవర్లకు సౌతాఫ్రికా 12 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.

సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగింది.

భారత బ్యాట్స్‌మెన్‌లలో... రోహిత్ శర్మ 0, ధవన్ 137 (136 బంతుల్లో), కోహ్లీ 46 (60 బంతుల్లో), రహానే 79 (60 బంతుల్లో) రైనా 6, ధోనీ 18, జడెజా 2, అశ్విన్ 5 (నాటౌట్), షమీ 4 (నాటౌట్) పరుగులు చేశారు. రహానే ఎల్బీగా వెనుదిరగగా, రోహిత్ శర్మ, జడెజాలు రనౌట్ అయ్యారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో... మోర్కెల్ 2, స్టెయిన్, తాహిర్, పార్నెల్‌లు చెరో వికెట్ తీశారు.

తొలుత నెమ్మదిగా ఆడిన భారత్ ఆ తర్వాత పుంజుకుంది. ఓ దశలో భారత్ 330కు పైగా చేస్తుందని భావించారు. కానీ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను తలపిస్తూ మరోసారి శ్లాగ్ ఓవర్లలో టపటపా వికెట్లు పడిపోయాయి. మిడిల్ ఆర్డర్ విఫలమైంది. చివర్లో నలభై ఆరు పరుగులకు అయిదు వికెట్లు పోయాయి.

భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా లక్ష్యం 308.

302 పరుగుల వద్ద ధోనీ ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. ధోనీ 11 బంతుల్లో మూడు ఫోర్లతో 18 పరుగులు చేశాడు.

ఓ వైపు వికెట్లు పడుతుంటే ధోనీ తన పాతశైలిలో ఆడుతున్నాడు. పార్నెల్ బౌలింగులో ధోనీ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. భారత్ స్కోర్ 48 ఓవర్లలో 297కు ఆరు వికెట్లు.

గత ఆదివారం పాకిస్తాన్ మ్యాచులోని భారత్ శ్లాగ్ ఓవర్లో తడపడింది. పటపటా వికెట్లు కోల్పోయింది. ఇప్పుడు కూడా అదే విధంగా కటకా వికెట్లు కోల్పోతోంది. 20 పరుగుల వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 284 పరుగుల వద్ద జడెజా (4 బంతుల్లో 2 పరుగులు) అవుటయ్యాడు. జడెజా రనౌట్ అయ్యాడు.

భారత్ తాజా స్కోరు 283 పరుగులకు ఐదు వికెట్లు.

భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రహానే 60 బంతుల్లో 79 పరుగులు చేసి అవుటయ్యాడు. స్టెయిన్ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. 261 పరుగుల వద్ద ధావన్, 269 పరుగుల వద్ద రైనా, 278 పరుగుల వద్ద రహానే అవుటయ్యాడు.

భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. రైనా వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడాడు. ఈ సమయంలో మోర్కెల్ బౌలింగులో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఆర్ఆర్ రసౌకు‌కు క్యాచ్ ఇచ్చాడు. రైనా ఐదు బంతుల్లో ఆరు పరుగులు చేశాడు. 261 పరుగుల వద్ద ధావన్ వికెట్ పడగా.. 269 పరుగుల వద్ద రైనా అవుటయ్యాడు. ధోనీ వచ్చాడు.

రహానే 53 బంతుల్లో 70 పరుగులు చేశాడు. 44 ఓవర్లకు భారత్ స్కోర్ 266 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.

ధావన్ అవుటయ్యాక రైనా వచ్చాడు. వచ్చీ రావడంతోనే మొదటి బంతికే ఫోర్ కొట్టాడు.

శిఖర్ ధావన్ అవుటయ్యాడు. పార్నెల్ బౌలింగులో అమ్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జట్టు స్కోరు 261 వద్ద ఉన్నప్పుడు మూడో వికెట్‌గా క్రీజు వదిలాడు. ధావన్ 146 బంతుల్లో.. 16 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు.

రహానే హాఫ్ సెంచరీ చేశాడు. 40 బంతుల్లో ఏడు ఫోర్లతో యాభై పరుగులు చేశాడు.

ప్రపంచ కప్‌లో అతనికి తొలి సెంచరీ

శిఖర్ ధావన్‌కు కెరీర్లో ఇది ఏడవ సెంచరీ. అతను సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లోను భారత్ గెలవడం గమనార్హం.

రహానే 23 బంతుల్లో 28 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి.

శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. ధావన్ 122 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి.

కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి ధావన్ దూకుడుగా ఆడారు.

ధావన్ 98 బంతుల్లో 86 పరుగులు చేశాడు. అజింక్య రహానే క్రీజులోకి వచ్చాడు.

భారత్ దూకుడు పెంచిన కాసేపటికే విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 27.1 ఓవర్లో కోహ్లీ... ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. భారత జట్టు స్కోరు 136 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ రూపంలో రెండో షాక్ తగిలింది. కోహ్లీ 60 బంతుల్లో... మూడు ఫోర్లతో 46 పరుగులు చేశాడు.

ధావన్ 91 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కోహ్లీ 53 బంతుల్లో 37 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికా పైన భారత్ దూకుడు పెంచింది. మరోసారి కోహ్లీ - దావన్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

భారత్ 20 ఓవర్లకు 87 పరుగులు చేసింది. ఒక వికెట్ కోల్పోయింది. ధావన్ 77 బంతుల్లో 57, కోహ్లీ 43 బంతుల్లో 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ చేశాడు. 70 బంతుల్లో 52 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఒత్తిడితో ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. 15 ఓవర్లకు భారత్ 67 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.

కోహ్లీ, ధావన్‌లు ఆచితూచి ఆడుతున్నారు.

మరోవైపు వరుణుడు భయపెడుతున్నాడు.

స్టేడియంలో స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సందడి చేశాడు.

ఆచితూచి ఆడుతున్న భారత్. పది ఓవర్లలో 36 పరుగులు చేసింది. ఒక వికెట్ కోల్పోయింది. కోహ్లీ 8, శిఖర్ ధావన్ 28 పరుగులతో ఉన్నారు.

రోహిత్ శర్మను డివిల్లియర్స్ రనౌట్ చేశాడు. రోహిత్ ఆరు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యాడు. రోహిత్ నిర్లక్షంగా ఆడి వికెట్ కోల్పోయాడు. రోహిత్ నిరాశపరిచాడు.

భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు 9 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను భారత్ కోల్పోయింది.

ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగారు. ఆచితూచి ఆడుతున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అజింక్యా రహానే, ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడెజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ

దక్షిణాఫ్రికా జట్టు: డికాక్ (వికెట్ కీపర్), ఆమ్లా, డుప్లెసిస్, డివిల్లియర్స్ (సారథి), డేవిడ్ మిల్లర్, డుమిని, పార్నెల్, ఫిలాండర్, స్టెయిన్, మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+