
హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం బార్మీ ఆర్మీ సిద్ధమైంది. కేవలం నలుగురితో ప్రారంభమైన ఈ బార్మీ ఆర్మీ... భారత్ ఆర్మీ పేరుతో మరో సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్‌లో టీమిండియా ఎప్పుడు మ్యాచ్‌లు ఆడుతున్నా... అక్కడి వచ్చి జట్టుకు తమ మద్దతుని ప్రకటిస్తుంటారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ ఆర్మీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అభిమానులు ఉన్నారు. మరో రెండు నెలల్లో ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం 22 దేశాల్లోని 8 వేల మంది భారత్ ఆర్మీ అభిమానులు ఇంగ్లాండ్‌కు తరలి రానున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది.
ఇంగ్లాండ్ వేదికగా 1999లో జరిగిన వరల్డ్‌కప్ సందర్భంగా కేవలం నలుగురితో ఈ భారత్ ఆర్మీ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ఆర్మీలో వేల మంది చేరారు. ఇంగ్లీషు గడ్డపై టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో కనీసం ఐదు నుంచి ఆరు వేల మంది భారత్ ఆర్మీ అభిమానులు ఉంటున్నారు.
భారత్ ఆర్మీ ఇప్పుడు కేవలం యూకేలోనే లేదని, అంతర్జాతీయంగా వివిధ దేశాలకు వ్యాపించిందని ఈ ఆర్మీ సృష్టికర్తలలో ఒకరైన రాకేష్ పటేల్ చెప్పారు. యూకేతోపాటు ఇండియా, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్‌ఏలాంటి దేశాల్లో భారత్ ఆర్మీ అభిమానులు ఉన్నారు.
గత 30 ఏళ్లుగా అనేక స్టేడియాల్లో భారత క్రికెట్ జట్టు ఆడుతోన్న అనేక మ్యాచ్‌లకు హాజరై రాకేష్ పటేల్ తన మద్దతుని తెలిపేవాడు. రోజురోజుకూ ఈ ఆర్మీతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా భారత క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్‌లను చూడటానికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోవడంతో 2015లో భారత్ ఆర్మీ ప్రత్యేకంగా ఓ ట్రావెల్ గ్రూపును ఏర్పాటు చేసింది.