అహ్మదాబాద్ : శనివారం రోజున ప్రపంచ దేశాల క్రీడారంగం చూపంతా భారత్‌పై ఉండబోతోంది. భారత్ పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ ఆరోజు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్‌కు వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే భారత్ పాక్ క్రికెట్ జట్లు అహ్మదాబాద్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు. అయితే డెంగ్యూ నుంచి కోలుకుంటున్న శుభ్‌మన్ గిల్ రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
మోదీ స్టేడియంలో గిల్ రికార్డు:శుభ్‌మన్ గిల్.. టీమిండియా స్టార్ ఓపెనర్. పైగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మంచి రికార్డు ఉన్న ఆటగాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాడు. మ్యాచ్ సమయం నాటికి ఫిట్‌నెస్ సాధిస్తే ఇక ఈ బ్యాట్స్‌మెన్ నుంచి మెరుపులు ఆశించొచ్చు. శుభ్‌మన్ గిల్ కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గిల్‌కు ధైర్యం నూరి పోశాడు. తను గతంలో అనుభవించిన చేదు జ్ఞాపకాల గురించి వివరిస్తూ వాటిని ఎలా అధిగమించాడో చెప్పుకొచ్చాడు.

స్ఫూర్తిని నింపిన యువరాజ్ సింగ్:2011 ప్రపంచ కప్ జరిగే సమయంలో యువరాజ్ సింగ్ తాను క్యాన్సర్‌తో పోరాడుతూ ఉండేవాడినని గుర్తుచేశాడు. తన మాటల ద్వారా శుభ్‌మన్ గిల్‌ను మానసికంగా బలపడేలా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతూనే తాను 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఆడినట్లు చెప్పాడు. తాను మానసికంగా సిద్ధమై టీమ్‌లో చేరేందుకు వచ్చినట్లు చెప్పాడు. పాకిస్తాన్‌తో ఆడేందుకు శుభ్‌మన్ గిల్ కూడా సిద్ధమవుతాడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. జ్వరం డెంగ్యూలాంటి జబ్బులతో బరిలోకి దిగడమంటే చాలా కష్టమని యువరాజ్ చెప్పాడు.

ప్రత్యేకతలు ఇవే..:చాలా ఏళ్ల తర్వాత భారత్ పాకిస్తాన్‌లు భారత్ గడ్డపై ఆడుతున్నారని ఈ గేమ్‌ను చూసేందుకు లక్షల్లో అభిమానులు స్టేడియంకు తరలివస్తారని చెప్పిన యువరాజ్.. ఈ మ్యాచ్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి తరుణం మళ్లీ మళ్లీ రాకపోవచ్చని పేర్కొన్నాడు.ఈ మ్యాచ్ తర్వాత మిగతా మ్యాచ్‌లు కూడా భారత్ విజయం సాధిస్తుందని యువరాజ్ జోస్యం చెప్పాడు.
ఇక భారత్ పాక్ వన్డే మ్యాచ్ 9 గంటల వరకు పొడిగించే అవకాశం ఉంది. గత ఏడేళ్లలో తొలిసారిగా భారత్‌లో పాక్ పర్యటిస్తుండటంతో మ్యాచ్ పై అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఈ మ్యాచ్ కోసం ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా రెండు వందే భారత్ రైళ్లను నడుపుతోంది.ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ఈ రైళ్లు పరుగులు తీస్తాయి.