
హైదరాబాద్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో ఓ చెత్త షాట్‌కు పెవిలియన్‌కు చేరిన యువ క్రికెటర్ రిషబ్ పంత్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ 56 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 32 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్‌తో కలిసి వికెట్ పడకుండా కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకున్నాడు. అయితే, కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో అవసరపు షాట్ ఆడి కోలిన్ డీ గ్రాండ్ హోమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ అనవసరపు షాట్‌పై ఈ ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా వ్వవహారిస్తోన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్విట్టర్‌లో "రిషబ్ పంత్ ఈ విధంగా ఔట్ అవడాన్ని ఎన్నిసార్లు చూశాం???!!!!!! ఈ కారణం చేతనే అతడు ప్రపంచకప్ జట్టులో తొలుత చోటు దక్కించుకోలేకపోయాడు" అని ట్వీట్ చేశాడు.
పీటర్సన్ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇస్తూ రిషబ్ పంత్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. యువీ తన ట్విట్టర్‌లో "అతడు కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడాడు. అది అతడి తప్పు కాదు. త్వరలోనే నేర్చుకుంటాడు. ఏది ఏమైనప్పటికీ మన అభిప్రాయాలను చెప్పడంలో తప్పులేదు" అని ట్వీట్ చేశాడు.
యువీ ట్వీట్‌కు పీటర్సన్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. "నిరాశ నుండి నా విమర్శ బయటకు వస్తుంది. అతడు చాలా మంచి ఆటగాడు మేట్. ఈ తప్పిదాన్ని అతడు ఇప్పటికే అనేక సార్లు చేశాడు. అతడు త్వరగా నేర్చుకోవాలని ఆశిద్దాం" అని పీటర్సన్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు యువరాజ్ సింగ్ అవును నీతో ఏకీభవిస్తున్నా అని ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 3 బంతులు మిగిలుండగానే 221 పరుగులకేకుప్పకూలిన టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.