
హైదరాబాద్: నాటింగ్ హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. పాకిస్థాన్‌పై వెస్టిండిస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి అలవోక విజయాన్ని నమోదు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వెస్టిండిస్ జట్టులో క్రిస్ గేల్ 34 బంతుల్లో 50(6 ఫోర్లు, 3 సిక్సులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్వల్ప లక్ష్యం కావడంతో వెస్టిండిస్ ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది. తొలుత జట్టు స్కోరు 11 పరుగుల వద్ద షాయ్ హోప్ పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత డారెన్ బ్రావో సీనియర్ పేసర్ మహ్మద్ ఆమీర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
దీంతో విండీస్ 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్ క్రిస్ గేల్ నిలకడగా ఆడి విండిస్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. నికోలస్ పూరన్ 19 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండిస్ కోల్పోయిన మూడు వికెట్లు పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఆమీర్‌కే దక్కాయి.
పాకిస్థాన్ 105 పరుగులకే ఆలౌట్
అంతకముందు టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుని నమోదు చేసింది. పాకిస్థాన్ ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేకపోయింది. పాకిస్థాన్ జట్టులో ఫకర్ జమాన్ (22), బాబర్ ఆజామ్ (22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్(2) పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో జట్టు స్కోరు 17 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8) వెనువెంటనే వికెట్లను కోల్పోయింది.
{headtohead_cricket_5_8}
విండీస్ బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడంలో విఫలమయ్యారు. చివర్లో వాహబ్ రియాజ్ 11 బంతుల్లో 18 (1 ఫోర్, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించడంతో పాకిస్థాన్ కనీసం వంద పరుగుల మార్కుని సైతం అందుకోగలిగింది. వెస్టిండిస్ జట్టులో ఒషాన్ థామస్ నాలుగు వికెట్లు తీయగా జాసన్ హోల్డర్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.