
హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంటేనే నిలకడలేమికి మారుపేరు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేదు. శుక్రవారం నాటింగ్ హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ మరోసారి చెత్త ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుని నమోదు చేసింది. పాకిస్థాన్ ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేకపోయింది. పాకిస్థాన్ జట్టులో ఫకర్ జమాన్ (22), బాబర్ ఆజామ్ (22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దీంతో పాకిస్థాన్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
పాకిస్థాన్ చెత్త ప్రదర్శనపై ఓ నెటిజన్ ట్విట్టర్‌లో "గ్రౌండ్‌కు రావడానికి నాకు పట్టిన సమయం-125 నిమిషాలు. అదే పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగియడానికి పట్టిన సమయం 111 నిమిషాలు" అంటూ ట్విట్టర్ ట్వీట్ చేశాడు. మరొక నెటిజన్ అయితే, ఆ దేశ ప్రధాని ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ "ఇమ్రాన్ ఖాన్ 100 శాతం అని చెప్తే వీరు 100 పరుగులు అనుకున్నారేమో!" అని ట్వీట్ చేశాడు.
{headtohead_cricket_8_5}
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో "పాకిస్థాన్ అంటే ఇదే. ఎలాంటి సందేహం లేదు, వరల్డ్‌కప్ గెలుస్తారు" అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో పాక్ జట్టుపై నెటిజన్లు చేసిన ట్వీట్లు మీకోసం....