Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికాతో ఆరంభ మ్యాచ్: తుది జట్టుని ఎంపిక చేసిన వీవీఎస్ లక్ష్మణ్

ICC World Cup 2019: VVS Laxman picks his Indian playing XI for South Africa match

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. టోర్నీలో భాగంగా కోహ్లీసేన జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దక్షిణాఫ్రికాతో తలపడే భారత జట్టుని ప్రకటించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఒకదానిలో ఓడగా... మరొక దానిలో విజయం సాధించింది. దీంతో సఫారీలతో తలపడబోయే భారత్ జట్టు ఎలా ఉంటే బాగుంటుందో లక్ష్మణ్ సూచించాడు. లక్ష్మణ్ ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లుగా రోహిత్, ధావన్‌లు బరిలోకి దిగనున్నారు.

ఇక, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లను నాలుగో స్థానానికి సరిపోతాడని తెలిపాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ధోనీకి ఐదో స్థానాన్ని కేటాయించగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఆరో స్థానం ఇచ్చాడు. ఏడో స్థానాన్ని రవీంద్ర జడేజాకు కేటాయించాడు. పేసర్లుగా షమీ, బుమ్రాలకు చోటు కల్పించిన లక్ష్మణ్... స్పిన్నర్లుగా యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేశాడు.

సఫారీలతో వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేసిన టీమిండియా:
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Wednesday, May 29, 2019, 19:39 [IST]
Other articles published on May 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+