Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీపైనల్స్‌లో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు: అన్ని సార్లూ లెప్ట్ ఆర్మ్ పేసర్లే!

ICC Cricket World Cup 2019,IND V NZ: Virat Kohli Wrost Record In World Cup Semi Finals ! || Oneindia
ICC World Cup 2019: Virat Kohli in World Cup semifinals - All dismissals to left-arm pacers!

హైదరాబాద్: ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) ఔటయ్యాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ వేసిన 2.4వ బంతి ఆడే క్రమంలో ఎల్బీగా ఔటయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, విరాట్ కోహ్లీ రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ అపవాదుని మూటగట్టుకున్నాడు. ప్రపంచకప్ సెమీపైనల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఔటైన అన్నీ సార్లు లెప్ట్ ఆర్మ్ పేసర్లే పెవిలియన్‌కు చేర్చారు.

2011 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ(9) పరుగుల వద్ద పాకిస్థాన్ లెప్ట్ ఆర్మ్ పేసర్ వాహబ్ రియాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత 2015 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ(1) పరుగు వద్ద ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ జాన్సన్ ఔట్ చేశాడు. ఇక, ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో కోహ్లీ(1) నిరాశ పరిచాడు.

కాగా, మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. రిజ‌ర్వ్‌డే రోజున 23 బంతుల్లో న్యూజిలాండ్ మ‌రో మూడు వికెట్లు కోల్పోయి 28 పరుగులు జోడించింది. దీంతో టీమిండియాకు 240 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భార‌త బౌల‌ర్లలో బుమ్రా(1/39), భువ‌నేశ్వ‌ర్‌(3/43)లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశారు. రిజర్వ్ డే రోజున జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇన్నింగ్స్ 48వ ఓవర్ ఆఖరి బంతికి డీప్ మిడ్‌వికెట్ నుంచి నేరుగా వికెట్ల మీద‌కు త్రో చేసి రాస్ టేల‌ర్‌ను ర‌నౌట్ చేశాడు. సుమారు 40 అడుగుల దూరం నుంచి జ‌డేజా డైర‌క్ట్‌గా వికెట్ల‌ను కొట్ట‌ాడు.

ఆ తర్వాత మ‌రో ఆటగాడు లాథ‌మ్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద జ‌డేజా అద్భుతంగా అందుకున్నాడు. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ బుధవారం జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. భువ‌నేశ్వ‌ర్ బౌలింగ్‌తో రిజ‌ర్వ్‌డే ప్రారంభమైంది. మంగ‌ళ‌వారం కివీస్ ఇన్నింగ్స్ 46.1 ఓవ‌ర్ల వ‌ద్ద వ‌ర్షం కార‌ణంగా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో ఓ సెమీఫైన‌ల్ మ్యాచ్ రిజ‌ర్వ్‌డే రోజున ఆడ‌డం ఇదే తొలిసారి.

Story first published: Wednesday, July 10, 2019, 17:01 [IST]
Other articles published on Jul 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+