
హైదరాబాద్: కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేఎల్ రాహుల్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. నిషేధం కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరిస్‌లకు దూరమైన కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ధీటుగా మంగళవారం కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో వరల్డ్‌కప్‌లో NO.4 స్థానంలో కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తుంది.
తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న కేఎల్ రాహుల్ కేవలం 10 బంతులాడి 6 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. బంగ్లాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలోలోనే క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్... ధోనీతో కలిసి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 94 బంతుల్లో (108; 99 బంతుల్లో 12 పోర్లు, 4 సిక్సులు) పరుగులతో సెంచరీని సాధించాడు.
ఈ మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "క్రికెట్ నేనెంటో నిరూపించుకోవడానికి ఓ చక్కని అవకాశం కల్పించింది. నిషేదంలో గడిపిన కాలమంతా స్నేహితులతో, కుటుంబంతో గడిపాను. మళ్లీ క్రికెట్‌లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నాను. నా బ్యాటింగ్‌తో పాటు టెక్నిక్‌లో లోపాలను సరిదిద్దుకోవాలని బావించా" అని అన్నాడు.
"బెంగళూరు వెళ్లి నా కోచ్ దగ్గర సలహా తీసుకున్నాను. ముఖ్యంగా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ మానసికంగా ఎంతో స్థైర్యాన్ని ఇచ్చాడు. ద్రవిడ్‌తో మాట్లాడిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని, పేలవ ప్రదర్శనను ఎలా జయించాలనో తెలుసుకున్నా. పరుగులు సాధించడం ఎలాగో వారిని అడిగి తెలుసుకున్నా" కేఎల్ రాహుల్ తెలిపాడు.
"ఐపీఎల్‌లో సాధ్యమైనంత ప్రయత్నించి పరుగులు రాబట్టాను. కానీ, అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏ జట్టుకు అయితే ఆడానో అదే జట్టుకు స్కోరు చేయాలని అనుకున్నా. తొలి వార్మప్‌లో అవకాశాన్ని కోల్పోయా. రెండో వార్మప్ మ్యాచ్ లో సాధ్యపడింది. అప్పటికే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ధోనీతో కలిసి ఎన్నో సార్లు చక్కని భాగస్వామ్యాలు నెలకొల్పిన సందర్భాలు ఉన్నాయి. అదే రిపీట్ చేశాం. భారీ స్కోరు నమోదు చేశాం" అని రాహుల్ అన్నాడు.