
హైదరాబాద్: మరో రెండు రోజుల్లో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన జట్లన్నీ ఇంగ్లాండ్‌కు చేరుకుని వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాకు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా నారింజ రంగు జెర్సీతో బరిలోకి దిగనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయక పోవడం విశేషం. కెప్టెన్ కోహ్లీ ఆరెంజ్ జెర్సీని ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ధరించిన నేవీ బ్లూ కలర్ జెర్సీతో ఈ టోర్నమెంట్ ఆడుతుండగా ఆప్ఘనిస్థాన్ కూడా సరిగ్గా అలాంటి జెర్సీతోనే బరిలోకి దిగుతుండటం విశేషం.
మరోవైపు శ్రీలంక కూడా ఈ వరల్డ్‌కప్‌లో బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా... ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లతో ఆడే మ్యాచ్‌ల్లో ఆరెంజ్ కలర్ జెర్సీని ధరించి ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లీ ఆరెంజ్ కలర్ జెర్సీ ధరించినట్లుగా ఫొటోషాప్ చేసిన ఫోటోని నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.