ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన ధరించనున్న కొత్త 'ఆరెంజ్ జెర్సీ' ఇదే

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ధరించే అరెంజ్ జెర్సీని టీమిండియా అధికారిక అపరెల్ స్పాన్సర్ నైకీ శుక్రవారం విడుదల చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బ్లూ, ఆరెంజ్ రంగుల కలయికతో
బ్లూ, ఆరెంజ్ రంగుల కలయికతో ఈ జెర్సీని రూపొందించారు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం మినహాయించి ప్రతి జట్టు రెండు రంగుల కిట్‌ల వివరాల్ని అందజేయాలి. రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా ఉన్నప్పుడు అందులో ఒక జట్టు.. వేరే రంగు జెర్సీని ధరించాలి.

ఇరు జట్ల జెర్సీలు నీలి రంగులో ఉండటంతో
ఇంగ్లాండ్, ఇండియా దేశాలకు చెందిన జట్ల జెర్సీలు నీలి రంగులో ఉండటంతో మ్యాచ్ వీక్షించేటప్పుడు అభిమానులు, అంపైర్లు, మైదానంలోని ఆటగాళ్లు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో హోమ్.. అవే విధానంలో ఆతిథ్య జట్టు ధరించే జెర్సీలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో టీమిండియా నారింజ రంగు జెర్సీ వేసుకోవాల్సి వస్తోంది.

ఇటీవలే జెర్సీని మార్చుకున్న శ్రీలంక
ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ధరించిన నేవీ బ్లూ కలర్ జెర్సీతో ఈ టోర్నమెంట్ ఆడుతుండగా ఆప్ఘనిస్థాన్ కూడా సరిగ్గా అలాంటి జెర్సీతోనే బరిలోకి దిగుతుండటం విశేషం. ఇటీవలే శ్రీలంక సైతం తన జెర్సీని మార్చుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications