నేలపై పడుకున్నారు: లంక-సఫారీ మ్యాచ్‌లో అనుకోని అతిథులు

హైదరాబాద్: చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు తేనెటీగలు ఆటంకం కలిగించాయి. శ్రీలంక ఇన్నింగ్స్ 48వ ఓవర్ ఐదో బంతి వేయడానికి ముందు ఒక్కసారిగా మైదానంలోకి తేనెటీగల గుంపులు రావడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు అంపైర్లతో సహా ఫీల్డ్‌లో ఉన్న ఆటగాళ్లంతా నేలపై పడుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆ తర్వాత కొద్దిసేపటికే అవి వెళ్లడంతో తిరిగి మ్యాచ్ కొనసాగించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. సఫారీ పేసర్ల ధాటికి విలవిల్లాడిన లంకేయులు.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో టోర్నీలో మూడో ఓటమిని మూటగట్టకుని నాకౌట్ అవకాశాలకు దూరం చేసుకున్నారు.
7 మ్యాచ్‌లాడిన శ్రీలంక
ఇప్పటికే 7 మ్యాచ్‌లాడిన శ్రీలంక కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గిన 10 పాయింట్లే ఖాతాలో చేరుతాయి. అందులో వర్షం కారణంగా 2 మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోవడంతో శ్రీలంక ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. దీంతో లంక రేసులో ఉన్నా.. నాకౌట్ చేరడం కష్టమే.
49.3 ఓవర్లలో 203 పరుగులు
కాగా, దక్షిణాఫ్రికా పేసర్లు ప్రిటోరియస్ (3/25), మోరిస్ (3/46), రబాడ (2/36) ధాటికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో కుషాల్ పెరెరా (30), అవిష్క ఫెర్నాండో(30)లు మాత్రమే రాణించగా... మిగిలినవారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.
లక్ష్య ఛేదనలో
అనంతరం లక్ష్య ఛేదనలో మలింగ వేసిన తొలి ఓవర్‌లోనే ఆమ్లా 2 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత 3 ఫోర్లతో మంచి టచ్‌లో కనిపించిన డికాక్ (15) మలింగ్ వేసిన యార్కర్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి ఆమ్లా న్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ మ్యాచ్‌లో ఆమ్లా చూడచక్కని షాట్లతో అలరించాడు.
రన్‌రేట్ ఎక్కువగా లేకపోవడంతో
సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా లేకపోవడంతో ఆచితూచి ఆడిన ఈ జోడీ 19వ ఓవర్‌లో స్కోను 100 దాటించింది. ఈ క్రమంలో ఆమ్లా 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కొద్దిసేపటికే 70 బతుల్లో డుప్లెసిస్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడిన డుప్లెసిస్ లక్మల్ ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాదాడు.
మరో 76 బంతులు మిగిలుండగానే
ఒకానొక దశలో సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీ పూర్తి చేసుకునేలా కనిపించినా.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో అది సాధ్యపడలేదు. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరికిపోయిన ఆమ్లా రివ్యూలో నాటౌట్‌గా తేలాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని ఈ జోడీ రెండో వికెట్‌కు 175 పరుగులు జోడించి మరో 76 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications