Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్

 ICC World Cup 2019: Starc surpasses McGrath in setting new World Cup wickets record

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఎడ్జిబాస్టన్ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో వికెట్ తీయడం ద్వారా మిచెల్ స్టార్క్ ఈ ఘనత సాధించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో మొత్తం 26 వికెట్లు తీసి ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డు సమం చేసిన మిచెల్ స్టార్క్... గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో(34) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేర్చాడు.

ఫలితంగా ఒక ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2007 ప్రపంచకప్ ఎడిషన్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్ తీసిన 26 వికెట్లు రికార్డుని బద్దలు కొట్టాడు. లీగ్ దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ 4-43తో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఈ ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్‌ ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.

స్మిత్‌ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేసన్‌ రా య్‌ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించగా... మోర్గాన్‌ (39 బంతుల్లో 45 నాటౌట్‌), రూట్‌ (46 బంతుల్లో 49 నాటౌట్‌; 8 ఫోర్లు) జట్టుకు విజయాన్ని అందించారు.

Story first published: Friday, July 12, 2019, 16:47 [IST]
Other articles published on Jul 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+