ఫైనల్‌కు కోహ్లీసేన అర్హత సాధించకపోవడంతో స్టార్ స్పోర్ట్స్‌కు వచ్చిన నష్టమెంతో తెలుసా!

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో అటు భారత అభిమానుల హృదయాలు ముక్కలవడంతో పాటు ఈ మెగా టోర్నీకి అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహారించిన స్టార్‌స్పోర్ట్స్ ఛానల్‌కు సైతం పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టోర్నీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించకపోవడంతో స్టార్స్ స్పోర్ట్స్‌కు సుమారు రూ.10 నుంచి 15 కోట్ల మేర నష్టపోయిందని అంచనా వేశారు.

సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమణ
సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించడంతో వ్యూయర్‌షిప్ సైతం తగ్గిందని స్టార్ నిర్వహకులు చెబుతున్నారు. మీడియా బయ్యర్లు అంచనా ప్రకారం టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించకపోవడంతో యాడ్ రెవిన్యూ పూర్తిగా తగ్గిపోయింది. టీమిండియా గనుక పైనల్‌కు అర్హత సాధించి ఉండి ఉంటే పది సెకన్ల యాడ్‌కు గాను ధర రూ.25-30 లక్షల వరకు ఉండేది.

ఫైనల్‌కు అర్హత సాధించకపోవడంతో
అయితే, టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించకపోవడంతో యాడ్ ధర రూ.15 నుంచి 17 లక్షలకు పడిపోయిందని అంటున్నారు. దీనిపై మోగయి మీడియా ఛైర్మన్ సందీప్ గోయల్ మాట్లాడుతూ "టీమిండియా నిష్క్రమణ నిరాశకు గురి చేసింది. అయితే, కొన్ని బ్రాండ్స్‌కు మాత్రం బొనాంజా సమయం. ఐపీఎల్‌తో పాటు ప్రపంచకప్ ద్వారా సుమారు 100 రోజులు నాన్‌స్టాఫ్ క్రికెట్‌ను ఎంజాయ్ చేశారు" అని అన్నాడు.

స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌కు భారీ నష్టం
ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లో జరిగినప్పటికీ భారత్ అభిమానులు చూసే విధంగా మ్యాచ్ సమయాలని టోర్నీ నిర్వాహకులు నిర్ణయించారు. అయితే, టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ప్రపంచకప్ అధికారిక ప్రసారదారైన స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌కు ఆశించిన లాభాలను రాలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

నాలుగేళ్లకొకసారి జరిగే ప్రపంచకప్
నాలుగేళ్లకొకసారి జరిగే ఈ ప్రపంచకప్‌కు ఈసారి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిచ్చింది. ఈ ప్రపంచకప్‌కు ఫోనే పే, వన్ ప్లస్, హవెల్స్, అమెజాన్, డ్రీమ్ 11, ఎమ్మారెఫ్ టైర్స్, కోకా-కోలా, ఉబెర్, ఒప్పో, ఫిలిప్స్, సియట్ టైర్లు, స్విగ్గీ, ఎయిర్‌టెల్, వోడాఫోన్, నెట్ ఫ్లిక్స్, పైసా బజార్, ఐసీఐసీఐ లాంబర్డ్ ఇలా మొత్తం 40 బ్రాండ్స్‌తో స్టార్ స్పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications