ప్రపంచకప్‌లో ఆకట్టుకోని స్పిన్నర్లు వీరే!

హైదరాబాద్: 12వ ప్రపంచకప్ ఎడిషన్ ముగిసింది. జులై 14న లార్డ్స్ వేదికగా జరిగిన పైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఓడించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, సూపర్ ఓవర్‌లో కూడా రెండు జట్ల సమానంగా పరుగులు చేయడంతో 'బౌండరీ రూల్' ప్రకారం ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.
అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం మ్యాచ్ ఫలితం రాబట్టేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా ఇరు జట్లు 15 పరుగులతో సమానంగా నిలిచాయి.
కాగా, ఈ ప్రపంచకప్‌లో 578 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించగా... ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 27 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
అయితే, ఈ ప్రపంచకప్‌లో స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. టోర్నీ అనంతరం ఐసీసీ ప్రకటించిన జట్టులో సైతం ఒక్క స్పిన్నర్‌కు కూడా చోటు దక్క లేదంటే వారి ప్రదర్శన ఎలా ఉందో అర్ధం చేసుకోండి. లెగ్ స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, రషీద్ ఖాన్‌లు ఈ ప్రపంచకప్‌లో పూర్తిగా విఫలమయ్యారు.
ఈ ప్రపంచకప్‌లో స్పిన్నర్ల ప్రదర్శనను ఒక్కసారి పరిశీలిస్తే!

యజువేంద్ర చాహల్
టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి చాహల్ ఈ మెగా టోర్నీని ఘనంగానే ఆరంభించాడు. అయితే, ఆ తర్వాత ఆడిన మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5.97 యావరేజితో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం పేసర్లు కలిపి 492 వికెట్లు తీయగా... స్పిన్నర్లు అందరూ కలిసి కేవలం 136 వికెట్లు మాత్రమే తీయగలిగారు.

రషీద్ ఖాన్
ఆప్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఇది తొలి ప్రపంచకప్. దీంతో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచకప్‌కు ముందు రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రపంచకప్‌లో సైతం అతడు విజృంభిస్తాడని అంతా భావించారు. అయితే, రషీద్ ఖాన్ ప్రదర్శన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్ కేవలం 7 వికెట్లు మాత్రమే తీసి 416 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే, ఏకంగా 110 పరుగులు సమర్పించుకుని ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇమ్రాన్ తాహిర్
దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్‌కు ఇదే ఆఖరి వరల్డ్‌కప్. ఈ ప్రపంచకప్‌లో తాహిర్ ప్రదర్శన ఫరవాలేదనిపించినా... అతడికి జట్టులోని సహచర బౌలర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. ఈ ప్రపంచకప్‌లో తాహిర్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఐదు కంటే తక్కువ యావరేజితో 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే, ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఆ జట్టుని టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. క్రిస్ మోరిస్(13) తర్వాత సఫారీ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇమ్రాన్ తాహిర్ నిలిచాడు.

కుల్దీప్ యాదవ్
కుల్దీప్ యాదవ్‌కు ఈ ప్రపంచకప్ పెద్ద నిరాశను కలిగించింది. ఈ మెగా టోర్నీలో కుల్దీప్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ యాదవ్ 6 వికెట్లు తీసి అభిమానులతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌ని సైతం నిరాశపరిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications