
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భుజం గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే ఆ జట్టు పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా వారం రోజుల పాటు టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా, డేల్ స్టెయిన్ కూడా టోర్నీ మొత్తానికి దూరమైనట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 104 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సఫారీలు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఆ జట్టుని ఆటగాళ్లు గాయాలు వేధిస్తున్నాయి. టోర్నీలో భాగంగా బుధవారం కోహ్లీసేన తన ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. డేల్ స్టెయిన్ స్థానాన్ని బెయురాన్ హెండ్రిక్‌తో భర్తీ చేయనున్నారు.
ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెయురాన్ హెండ్రిక్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరుపున రెండు మ్యాచ్‌లాడిన హెండ్రిక్ ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే, టీ20ల్లో మాత్రం విజయవంతమైన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 18.93 యావరేజితో 16 వికెట్లు తీశాడు.
ఈ ఏడాది జనవరిలో సెంచూరియన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో హెండ్రిక్(4/14) కెరీర్ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 140kmph వేగంతో బౌలింగ్ చేయగల సమర్ధుడు. ఇతడి రాకతో సఫారీల బౌలింగ్ ఎటాక్ మరింత బలోపేతం కానుంది.