న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా కోలుకోవాలంటే: ఇంగ్లాండ్ బ్రూప్రింట్ ఫాలో కావాల్సిందే!

ICC World Cup 2019: South Africa must use England’s blueprint for ODI recovery, suggests Jacques Kallis

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో సెమీస్‌ అవకాశాల్ని పూర్తిగా కోల్పోయి... లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు మాజీ క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ ఓ సూచన చేశాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికా తిరిగి కోలుకునేందుకు ఇంగ్లాండ్ బ్లూప్రింట్‌ను ఉపయోగించాలని తెలిపాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ జట్టు కూడా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇంగ్లీషు బోర్డు జట్టులో స్వల్ప మార్పులు చేసింది.

ఇంగ్లాండ్ పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం

ఇంగ్లాండ్ పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం

ఆ తర్వాత నుంచి ఇంగ్లాండ్ వన్డేల్లో అద్భుతంగా పుంజుకుంది. అద్భుతమైన విజయాలను నమోదు చేసి ప్రస్తుతం పరిమిత ఒవర్ల ఫార్మాట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, వన్డేల్లో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని చేరుకునేందుకు ఇంగ్లాండ్ జట్టు ఏ బ్రూప్రింట్‌నైతే అనుసరించిందో దానిని ఇప్పుడు సఫారీలు కూడా అనుసరించాలని సూచించాడు.

ఐసీసీకి రాసిన కాలమ్‌లో

ఐసీసీకి రాసిన కాలమ్‌లో

"2015 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ తీవ్రంగా నిరాశపరిచింది. అయితే, ఆ తర్వాత జట్టులో పలు మార్పులు చేయడంతో పాటు వన్డే క్రికెట్ ఏ విధంగా ఆడాలనే దానిపై ఆటగాళ్ల మానసిక స్థితిని పూర్తిగా మార్చివేసింది" అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెబ్‌సైట్‌కి రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.

భయం లేకుండా క్రికెట్

భయం లేకుండా క్రికెట్

"ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు భయం లేకుండా ఆడుతుంది, అంతేకాదు తప్పులు చేయడానికి భయపడదు. ప్రస్తుత టోర్నీలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా పలు మ్యాచ్‌ల్లో రక్షణాత్మకంగా వ్యవహారించింది. టోర్నీలో ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా దూకుడుగా, మంచి పాజిటివ్ క్రికెట్ ఆడితే బాగుంటుంది" అని కల్లిస్ తెలిపాడు.

జట్టు మొత్తంలో మార్పులు

జట్టు మొత్తంలో మార్పులు

"జట్టు మొత్తంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ గత నాలుగేళ్లుగా కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. ప్రస్తుతం జట్టులో అద్భుతమైన యువ ఆటగాళ్లు ఉన్నారు(రబాడ-24, లుంగి ఎంగిడి-23, ఫెలుక్వాయో-23, మర్క్రమ్-24). రాబోయే రోజుల్లో వారే ఆ జట్టు భవిష్యత్తు" అని కల్లిస్ అన్నాడు.

Story first published: Monday, June 24, 2019, 16:06 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X