ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కూడా ఫేవరెట్ జట్టే: గంగూలీ

2019 ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో పాకిస్థాన్ కూడా ఒకటని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుండి ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీలు అందరూ ప్రపంచకప్‌లో తమ ఫేవరెట్ జట్టేదో, అందుకు గల కారణాలను కూడా వెల్లడిస్తు న్నారు. ఇదివరకే ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్ అని చెప్పిన గుంగూలీ.. తాజాగా పాకిస్థాన్ జట్టుపై తన అభిప్రాయాల్ని తెలిపారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లండ్ పిచ్‌లు కలిసొచ్చాయి:
తాజాగా గుంగూలీ మాట్లాడుతూ... 'పాకిస్థాన్‌కు ఇంగ్లండ్ పిచ్‌లు బాగా కలిసొచ్చాయి. 2017లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, 2009లో టీ20ప్రపంచకప్‌లు సాధించింది. ప్రపంచకప్‌లో ఇది వాళ్లకు అనుకూలించనుంది. ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ బాగా ఆడుతుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో ఆడిన వన్డే సిరీస్‌లోనూ పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన చేసింది. 374 పరుగుల భారీ ఛేదనలో కూడా కేవలం 12 పరుగుల తేడాతో ఓడిపోయారు' అని గుంగూలీ తెలిపారు.

పాకిస్థాన్ కూడా ఫేవరెట్:
ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ మ్యాచులను సైతం గెలిచారు. ఇదంతా పాక్ బౌలింగ్ లైనప్‌తోనే సాధ్యమయింది. పాక్ బౌలింగ్తో ప్రత్యర్థులకు కష్టాలు తప్పకపోవచ్చు. ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో పాకిస్థాన్ కూడా ఒకటి. నేను రికార్డులను నమ్మను. భారత్, పాకిస్థాన్ పోరులో ఎవరు మంచి ప్రదర్శన చేస్తే.. విజయం వారినే వరిస్తుంది. అయితే భారత్ మాత్రం మెరుగ్గా కనిపిస్తోంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉంది' అని గుంగూలీ పేర్కొన్నారు.

కోహ్లీకి ధోనీ పెద్ద అండ:
ఐపీఎల్-12లో విరాట్ కెప్టెన్సీ వైఫల్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీ రికార్డు బాగుంది. అతను కచ్చితంగా కెప్టెన్సీలో రాణిస్తాడు. జట్టులో మాజీ కెప్టెన్‌గా ధోనీ ఉండటం కోహ్లీకి పెద్ద అండ. ధోనీ సూచనలు కోహ్లీకి ఉపయోగపడుతాయి. ఇక రోహిత్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. అద్భుత ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన జట్టుకు ఎంతో ఉపయోగపడనుంది' అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

ట్రోఫీతో తిరిగిరావాలి:
'2003 ప్రపంచకప్ జట్టును ప్రస్తుత జట్టును పోల్చలేము. రెండు వేర్వేరు తరాలకు చెందిన జట్లు. అప్పుడు మేము ఫైనల్ వరకు చేరాం. ప్రస్తుత జట్టు మాత్రం ఫైనల్లో గెలిచి ట్రోఫీతో తిరిగిరావాలని కోరుకుంటున్నా. ప్రపంచకప్‌లోని 10 జట్లు.. మిగతా జట్లతో మ్యాచులు ఆడాలి.. ఇది ఆసక్తిగా ఉంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ కూడా ట్రోఫీని గెలుచుకోగలవు' అని దాదా చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications