విండిస్‌తో మ్యాచ్‌లో మహ్మద్ షమీ 2.0ను చూపించాడు

హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. టీమిండియా బౌలింగ్ ఎటాక్‌లో ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మలతో పోలిస్తే ఫస్ట్ ఛాయిస్ బౌలర్‌గా ఎదిగాడు. టీమిండియా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆడిన షమీ మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గత ప్రపంచకప్‌లో షమీ అత్యుత్తమం 4/35. ఆ తర్వాత షమీని ఫిట్‌నెస్ సమస్యలతో పాటు గాయాలు వేధించాయి. దీంతో మోకాలి చికిత్స చేయించుకున్న షమీ ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత యో-యో టెస్టులో విఫలం కావడంతో గతేడాది జూన్‌లో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమయ్యాడు.

షమీపై ఆరోపణలు
అదే సమయంలో షమీపై అతడి భార్య ఆరోపణలు చేయడం.... కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేయడం.. బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడం లాంటివి జరిగాయి. అయితే, అతడిపై చేసిన ఆరోపణలు తప్పని తేలడంతో తిరిగి బీసీసీఐ నుంచి కాంట్రాక్టు దక్కించుకున్నాడు.

థర్డ్ ఛాయిస్ పేసర్‌గా
ఈ సమయం షమీకి గడ్డుకాలమే. ఇక, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌ల తర్వాత షమీని థర్డ్ ఛాయిస్ పేసర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. షమీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. జూన్ 16న మాంచెస్టర్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ గాయపడ్డాడు.

భువీ గాయపడితేనే షమీకి అవకాశం
దీంతో షమీకి తుది జట్టులో అవకాశం దక్కింది. తనకు వచ్చిన అవకాశాన్ని షమీ చక్కగా వినియోగించుకుంటున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో నమోదు చేసిన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన షమీ... గురువారం అదే స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో గొప్పగా బౌలింగ్ చేశాడు.

నిప్పులు చెరిగే బంతులతో
నిప్పులు చెరిగే బంతులతో వెస్టిండిస్ పతనాన్ని శాసించాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను పడగొట్టి వికెట్ల వేటను ఆరంభించిన షమీ ఆ తర్వాత మరింతగా చెలరేగాడు. వికెట్ కీపర్ షాయ్ హోప్‌ను షమి బౌల్డ్ చేసిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అనూహ్యంగా లోపలికి స్వింగ్ అయిన బంతికి హోప్ ఔటయ్యాడు.

మ్యాచ్‌కే హైలెట్
స్టంప్ ఎగిరిపోయాక ఏం జరిగిందన్నట్లుగా అతను ఆశ్చర్యపోయాడు. ఈ మ్యాచ్‌లో మరో ఇద్దరిని పెవిలియన్‌కు చేర్చిన షమీ... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన భారత తొలి బౌలర్‌గా షమీ అరుదైన ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications