For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ రికార్డుకి చేరువలో బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్

ICC World Cup 2019: Shakib Al Hasan On The Verge Of Equaling Sachin Tendulkar’s Record

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం ఫాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుకి చేరువయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే 7 మ్యాచ్‌లు ఆడిన 542 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తద్వారా ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌శర్మ(544) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శుక్రవారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో షకీబ్ ఉల్ హాసన్ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే సచిన్‌ టెండూల్కర్ రికార్డుని సమం చేస్తాడు.

2003 ప్రపంచకప్‌లో సచిన్ 11 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలతో 673 పరుగులు చేశాడు. పాక్‌పై హాఫ్ సెంచరీ సాధిస్తే సచిన్‌ తర్వాత ఒక ప్రపంచకప్‌లో ఏడు సార్లు 50కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. దీంతో పాటు షకీబ్ ఖాతాలో మరో రికార్డు చేరనుంది.

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా కుమార సంగర్కర(12) రికార్డుని సైతం సమం చేస్తాడు. షకిబ్‌ ఉల్ హాసన్ ప్రస్తుతం (11) హాఫ్ సెంచరీలతో ఉండగా... ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (21) హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటికే బంగ్లా సెమీస్ నుంచి తప్పుకుంది.

Story first published: Friday, July 5, 2019, 14:09 [IST]
Other articles published on Jul 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+