చిరాకు తెప్పిస్తున్నాయి: భారత్-పాక్ మ్యాచ్‌పై వస్తోన్న టీవీ యాడ్‌లపై సానియా మిర్జా

హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజ్ వేరు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో భాగంగా ఇరు జట్లు జూన్ 16న తలపడనున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఓ యాడ్‌ను విడుదల చేయగా... అందుకు ప్రతిగా స్టార్ స్పోర్ట్స్ 'మౌకా మౌకా' టీవీ యాడ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అయితే, ఈ టీవీ యాడ్‌లపై భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్విట్టర్‌లో సానియా మిర్జా
"సరిహద్దుకి ఇరు ప్రాంతాల్లో చిరాకు తెప్పించే ప్రకటనలు వస్తున్నాయి. సీరియస్‌గా చెబుతున్నాను. ఈ మ్యాచ్‌కు మీరు మరింత ప్రచారం కలిగించాల్సిన అవసరం లేదు. చెత్త పనులతో... ఈ మ్యాచ్‌పై అభిమానులు ఇప్పటికే కావాల్సినంత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ అని మీరు భావిస్తుంటే, మీకు స్వీయ నియంత్రణ అవసరం. అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకండి" అని ఆమె ట్వీట్ చేశారు.

మౌకా-మౌకా యాడ్ ఎంతో పాపులర్:
ఐసీసీ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ జట్లు ఎప్పుడు తలపడినా.. ఈ మౌకా-మౌకా యాడ్ ఎంతో పాపులర్ అయ్యేది. గత యాడ్‌లో పాక్ జట్టు జెర్సీని ధరించిన ఓ అభిమాని తమ జట్టు గెలిస్తే సంబరాలు చేసుకుందామని టపాకాయలు తీసుకొస్తాడు.
‘హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ స్టార్ట్ స్పోర్ట్స్ ట్వీట్
మ్యాచ్‌లో ఓడిపోవడంతో వాటిని తీసుకెళ్లి వచ్చే వరల్డ్‌కప్ కోసం దాచిపెడతాడు. అయితే, ఈసారి జూన్ 16 ఫాదర్స్ డే కావడంతో స్టార్ స్పోర్ట్స్ కాస్త భిన్నంగా యాడ్‌ని రూపొందించింది. ఈ యాడ్ అతిగా ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ చూసిన వారు ‘బాప్‌రే బాప్' అంటారని పేర్కొంటూ ‘హ్యాపీ ఫాదర్స్ డే' అని స్టార్ట్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది.

పాకిస్థాన్‌పై టీమిండియాదే పైచేయి
కాగా, వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాదే పైచేయి. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఆరుసార్లు తలపడగా అన్నీ సార్లు టీమిండియానే విజయం సాధిస్తూ వస్తోంది. 1992, 1996, 1999, 2003, 2015లలో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఏడోసారి.

పాకిస్థాన్ జాజ్ టీవీ విడుదల చేసిన యాడ్ ఇదే
మరోవైపు భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఓ యాడ్‌ను విడుదల చేసింది. ఈ యాడ్‌లో వింగ్ కమాండర్ అభినందన్ సంఘటనను వ్యంగ్యంగా చూపుతూ రూపొందించింది. అందులో అచ్చం అభినందన్‌లాగే ఉన్న ఓ వ్యక్తి టీమిండియా జెర్సీని ధరించాడు.
టాస్ గెలిస్తే ఏం చేస్తారని ఆ వ్యక్తిని అడిగితే
టాస్ గెలిస్తే ఏం చేస్తారని ఆ వ్యక్తిని అడిగితే.. ఐయామ్ సారీ నేనేమీ చెప్పకూడదంటూ ఆ వ్యక్తి అంటాడు. ఇక చివరగా టీ కప్‌తో వెళ్తుంటే.. ఆ కప్పును ఎక్కడికి తీసుకు వెళ్తున్నావంటూ లాగేసుకుంటారు. ఇందుకు సంబంధించిన యాడ్ మీకోసం...
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications