Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-కివీస్ మ్యాచ్ రద్దుపై అమితాబ్ బచ్చన్ సెటైరికల్ ట్వీట్

ICC World Cup 2019’s India vs New Zealand match is a washout, Amitabh Bachchan jokes shift venue to India

హైదరాబాద్: వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దవడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో జోకు పేల్చారు. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌కు వరుణుడు అంతరాయం కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గురువారం నాటింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన మ్యాచ్ చివరకు వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దుపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్‌కు మళ్లించండి.. అలాగైనా మన దేశంలో వర్షాలు పడతాయేమో" అంటూ ట్వీట్ చేశారు.

టోర్నీకి ముందు వరకు ప్రపంచకప్‌లో 402 మ్యాచ్‌లు జరిగితే.. అందులో టాస్‌ పడకుండా రద్దయిన మ్యాచ్‌లు రెండు మాత్రమే. కానీ, ఈ టోర్నీలో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు పూర్తి కాగా.. అందులో మూడు టాస్‌ పడకుండానే రద్దకాగా... మరో మ్యాచ్‌ ఆట ఆరంభమైన కొద్దిసేపటికే ఆగిపోయింది.

వరుసపెట్టి మ్యాచ్‌లు రద్దు అవుతుండడంపై ఐసీసీపై అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచకప్ కోసం ఐసీసీ రూపొందించిన షెడ్యూల్‌ను సైతం తప్పుబడుతున్నారు. ఇండియా-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి టోర్నీకే హైలెట్‌గా నిలిచే భారత్-పాక్ మ్యాచ్‌పై పడింది.

Story first published: Friday, June 14, 2019, 19:21 [IST]
Other articles published on Jun 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+