Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంగక్కర రికార్డు బద్దలు: ఐదు సెంచరీలతో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

Rohit Sharma

హైదరాబాద్: లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 93 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. దీంతో రోహిత్ శర్మ ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ శర్మ బద్దలుగొట్టాడు. 2015 ప్రపంచకప్‌‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు సాధించాడు.

అయితే, సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 189 పరుగుల వద్ద రోహిత్ శర్మ 94 బంతుల్లో 103(14 ఫోర్లు, 2 సిక్సులు) వద్ద కాసున్ రజిత బౌలింగ్‌లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

మరోవైపు ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇదే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్(586) రికార్డుని బంగ్లా క్రికెటర్ షకీబ్ ఉల్‌ హాసన్(606) అధిగమించాడు. తాజాగా శ్రీలంక మ్యాచ్‌లో రోహిత్‌ షకీబ్ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. అంతేకాదు ప్రపంచకప్‌లో 600పైకి పైగా పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా మరో ఘనత కూడా సాధించాడు.


శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం
ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లీగ్ స్టేజిలో ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించిన కోహ్లీసేన 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.



టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఓపెనర్లు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్‌ శర్మ 94 బంతుల్లో 103(14 ఫోర్లు, 2 సిక్సులు), కేఎల్‌ రాహుల్‌ 118బంతుల్లో 111(11 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీలతో చెలరేగారు.

ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ 41 బంతుల్లో 34నాటౌట్‌(3 ఫోర్లు), హార్దిక్ పాండ్య(7నాటౌట్‌)తో కలిసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ, కసున్ రజిత, ఇసురు ఉదానాలు తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

{headtohead_cricket_3_7}

Story first published: Saturday, July 6, 2019, 23:10 [IST]
Other articles published on Jul 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+