'నేనైతే పంత్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తా'

హైదరాబాద్: ఇంగ్లండ్ పరిస్థితులపై చక్కటి అవగాహన ఉన్న రిషబ్ పంత్‌ను తానైతే నాలుగో స్థానానికి ఎంపిక చేస్తానని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. గాయంతో శిఖర్ ధావన్ టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్‌ను ఇంగ్లాండ్ పిలిపించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
రిషబ్ పంత్‌ను నాలుగులో బ్యాటింగ్‌కు పంపితే టీమిండియాకు లాభం చేకూరుతుందని ఐసీసీకి రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. "జట్టు మేనేజ్‌మెంట్‌లో నా ప్రమేయం ఉంటే నాలుగో స్థానంలో రిషభ్‌పంత్‌ను పరిశీలిస్తా. స్టాండ్‌బైగా ఉన్న అతడిని ఇక్కడికి రప్పించారు. ఆడటానికి అతడు సిద్ధంగా ఉన్నాడు" అని అన్నాడు.

గత టెస్టు సిరిస్లో ఆకట్టుకున్న పంత్
"ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నింటికి మించి ఇక్కడి పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉంది. గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పంత్ ఆకట్టుకున్నాడు. గత వేసవిలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పంత్ ఆకట్టుకోవడం మనం చూశాం. టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది. అతడిని బరిలో దించేందుకు ఇదే మంచి తరుణం" అని అన్నాడు.

వారి ఆటలో మార్పు అవసరం
"మిడిలార్డర్‌లో విజయ్ శంకర్, కేదార్ జాదవ్ ఇంకా ఆకట్టుకోలేదు. వారి ఆటలో మార్పు అవసరం" అని శ్రీకాంత్ వివరించారు. కాగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అందిస్తున్న శుభారంభాల్ని భారీ భాగస్వామ్యాలుగా మలచాలని శ్రీకాంత్ సూచించాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ రాణించలేకపోయిన సంగతి తెలిసిందే.

గత రెండు మ్యాచ్‌ల్లో రాణించని రోహిత్
"గత రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ మెరుపులు లేవు. రాహుల్ ఇంకా ఎక్కువ పరుగులు చేయాలి. అతడు శుభారంభం చేస్తున్నాడు గానీ కీలక సమయంలో వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఆ ఆరంభాల్ని భారీ స్కోర్లుగా మార్చాలని అందరి కన్నా ఎక్కువగా అతడికే తెలుసు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఇదే జోరు కొనసాగించాలి" అని శ్రీకాంత్ అన్నాడు.

ఓడినా నష్టం లేదు కానీ అలా కానివ్వకుండా
"ఓడినా నష్టం లేదు కానీ అలా కానివ్వకుండా కోహ్లీసేన జాగ్రత్త పడాలి. ఆసీస్ ఒక్క సారి జోరందుకున్నాక వెనక్కి తిరిగి చూడలేదు. పాక్ సరైన సమయంలో పుంజుకుంది. విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు" అని శ్రీకాంత్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications