For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చర్చ జరగాల్సింది పంత్‌పై కాదు, రాయుడికి చోటు దక్కపోవడంపై: గంభీర్

ICC World Cup 2019: Rayudus omission should be debated more than Rishabh Pant: Gambhir

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన జట్టులో అంబటి రాయుడికి చోటు లభించకపోవడం తనను గుండె పగిలేంత బాధకు గురి చేసిందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. కేవలం మూడు ఫెల్యూయిర్స్ కారణంగా అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా బాధాకరమని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో చోటు దక్కించుకుంటారని భావించిన అంబటి రాయుడు, రెండో వికెట్‌ కీపర్‌ స్థానానికి దినేశ్ కార్తీక్‌తో పోటీపడిన రిషబ్ పంత్‌లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌

కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌

ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపిక చేయడాన్ని తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్న సంగతి తెలిసిందే. దీనిపై గంభీర్ మాట్లాడుతూ నిజానికి రిషభ్‌పంత్‌ తనకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేదని తెలిపాడు. అసలు ఇప్పుడు అంబటి రాయుడికి చోటు దక్కకపోవడంపై చర్చించాలని గంభీర్ అన్నాడు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో గంభీర్ మాట్లాడుతూ

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో గంభీర్ మాట్లాడుతూ "రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడంపై చర్చించాల్సిన అవసరం లేదు... అంబటి రాయడి గురించి చర్చించాలి. వైట్ బాల్ క్రికెట్‌లో 48 యావరేజి, 33 ఏళ్ల వయసున్న క్రికెటర్‌ను వదిలేయడం చాలాచాలా దురదృష్టకరం. మిగతా సెలక్షన్‌ నిర్ణయాలతో పోలిస్తే నాకైతే ఇది గుండెపగిలేంత బాధగా అనిపిస్తోంది" అని అన్నాడు.

NO.4 స్థానానికి చక్కగా సరిపోతాడన్న కోహ్లీ

NO.4 స్థానానికి చక్కగా సరిపోతాడన్న కోహ్లీ

ఒకానొక సందర్భంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అంబటి రాయుడు NO.4 స్థానానికి చక్కగా సరిపోతాడని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో రాయుడు పేలవ ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు రాయుడిని పరిగణనలోకి తీసుకోలేదు. 2007లో తనను ఎంపిక చేయనప్పుడు తాను కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నానని గంభీర్ చెప్పాడు.

నేను కూడా ఇలాంటి పరిస్థితేనే ఎదుర్కొన్నా

నేను కూడా ఇలాంటి పరిస్థితేనే ఎదుర్కొన్నా

"రాయుడికి సారీ చెప్తున్నా. 2007లో నన్ను ఎంపిక చేయనప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితేనే ఎదుర్కొన్నా. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఎంపిక అవ్వకపోతే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. వరల్డ్‌కప్ లాంటి ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ చిన్ననాటి కల. ఈ టోర్నీకి ఎంపికవ్వని మిగతా క్రికెటర్లతో పోలిస్తే రాయుడిని చూస్తేనే బాధేస్తుంది" అని గంభీర్ చెప్పాడు.

పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై

పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై

మరోవైపు రిషబ్ పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై కూడా గంభీర్ స్పందించాడు. "ఇది ఎంతమాత్రం ఎదురుదెబ్బ కాదు. పంత్‌ను ఎంపిక చేయకపోవడం ఎదురుదెబ్బ ఎలా అవుతుంది? వైట్ బాల్ క్రికెట్‌లో పంత్ నిలకడగా రాణించడం లేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేదు. కాబట్టి దీనిని ఎదురుదెబ్బ అనొద్దు" అని గంభీర్ తెలిపాడు.

Story first published: Tuesday, April 16, 2019, 18:54 [IST]
Other articles published on Apr 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+