Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్: 'ఒత్తిడి తొలగిపోయింది, పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి'

ICC World Cup 2019: Pressure off Pakistan After Win Against England: Flower

హైదరాబాద్: ఇంగ్లాండ్‌పై విజయం తమ జట్టు ఆటగాళ్లకు మంచి ఉపశమనం కలిగించిందని పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్‌ ఫ్లవర్‌ పేర్కొన్నాడు. వెస్టిండిస్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాకిస్థాన్ జట్టు ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నీలో భాగంగా శుక్రవారం బ్రిస్టల్ వేదికగా శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కి ముందు గ్రాంట్ ప్లవర్ మాట్లాడుతూ ఇంగ్లాండ్‌‌పై విజయం తమ ఆటగాళ్లకి మంచి ఉపశమనం కలిగించిందని తెలిపాడు. ఇంగ్లాండ్‌ లాంటి బలమైన జట్టుపై దాదాపు 350 స్కోర్‌ సాధించడం ద్వారా తమపై ఉన్న ఒత్తిడి తొలగిపోయిందని అన్నాడు.

ఈ విజయంతో తమలో పూర్తి ఆత్మవిశ్వాసంతో నెలకొందని చెప్పుకొచ్చాడు. "వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మా ఆటగాళ్లు పరిస్థితులకు అలవాటు పడలేదు. అప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యారు. తర్వాత ఇంగ్లాండ్‌పై ఆడేటప్పుడు దాన్ని జయించి మంచి ప్రదర్శన చేశారు. ఇదే అసలైన పరీక్ష. రెండో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు" అని అన్నాడు.

మరోవైపు శ్రీలంక తన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోగా, ఆ తర్వాత ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో శ్రీలంకను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని తెలిపాడు. ఇదిలా ఉంటే, పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు.

ఈ క్రమంలో టాస్‌ ఆలస్యం కానుంది. మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్‌ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో టాస్‌ను నిలిపివేశారు. ఈ మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. వరల్డ్ కప్‌లో శ్రీలంకపై పాకిస్థాన్‌ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడగా ఏడింట్లోనూ పాక్ విజయం సాధించింది.

Story first published: Friday, June 7, 2019, 17:13 [IST]
Other articles published on Jun 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+