Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రా చూపిస్తూ పాక్ టీవీ యాడ్‌పై మండిపడ్డ పూనమ్ పాండే (వీడియో)

పాకిస్థాన్‌కు పూనమ్ పాండే ‘బ్రా’ పంచ్... వైరల్ అవుతున్న వీడియో!
ICC World Cup 2019: Poonam Pandey wants to give Pakistan a different kind of cup

హైదరాబాద్: భారత వైమానికదళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను అవమానిస్తూ పాక్‌ టీవీ ఛానెల్ జాజ్ టీవీ రూపొందించిన యాడ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్లు తలపడున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌పై పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఓ యాడ్‌ను విడుదల చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ యాడ్‌లు ఇరు దేశాల మధ్య ఉన్న విద్వేషాన్ని మరింతగా రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే ఈ యాడ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మండిపడింది. ఈ మేరకు ఓ వీడియోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

పాకిస్థాన్ సంబంధించిన ఈ యాడ్‌ను చూశా

"నిన్ననే నా వాట్సాప్‌లో పాకిస్థాన్ సంబంధించిన ఈ యాడ్‌ను చూశాను. ఓ హీరో చేసిన పనిని వారు అపహాస్యం చేశారు. పాక్ ఇది మంచిది కాదు. ఈ యాడ్‌పై నా సమాధానం ఏంటంటే? టీ కప్పులపై సెటైర్లు ఎందుకు. వాస్తవానికి మీకు కావాల్సింది. ఈ కప్‌( తన లోదుస్తులు చూపిస్తూ) డబుల్‌ కప్‌" అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ట్విట్టర్ వేదికగా సానియా మిర్జా అసంతృప్తి

కాగా, అంతకముందు ఈ టీవీ యాడ్‌లపై భారత టెన్నిస్ స్టార్‌ సానియా మిర్జా ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. "సరిహద్దుకి ఇరు ప్రాంతాల్లో చిరాకు తెప్పించే ప్రకటనలు వస్తున్నాయి. సీరియస్‌గా చెబుతున్నాను. ఈ మ్యాచ్‌కు మీరు మరింత ప్రచారం కలిగించాల్సిన అవసరం లేదు. చెత్త పనులతో... ఈ మ్యాచ్‌పై అభిమానులు ఇప్పటికే కావాల్సినంత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ అని మీరు భావిస్తుంటే, మీకు స్వీయ నియంత్రణ అవసరం. అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకండి" అని ఆమె ట్వీట్ చేశారు.

వరల్డ్‌కప్ కోసం దాచిపెడతాడు

మ్యాచ్‌లో ఓడిపోవడంతో వాటిని తీసుకెళ్లి వచ్చే వరల్డ్‌కప్ కోసం దాచిపెడతాడు. అయితే, ఈసారి జూన్ 16 ఫాదర్స్ డే కావడంతో స్టార్ స్పోర్ట్స్ కాస్త భిన్నంగా యాడ్‌ని రూపొందించింది. ఈ యాడ్ అతిగా ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ చూసిన వారు ‘బాప్‌రే బాప్' అంటారని పేర్కొంటూ ‘హ్యాపీ ఫాదర్స్ డే' అని స్టార్ట్‌ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది.

పాకిస్థాన్ జాజ్ టీవీ విడుదల చేసిన యాడ్‌ ఇదే

భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఓ యాడ్‌ను విడుదల చేసింది. ఈ యాడ్‌లో వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ సంఘ‌ట‌న‌ను వ్యంగ్యంగా చూపుతూ రూపొందించింది. అందులో అచ్చం అభినంద‌న్‌లాగే ఉన్న ఓ వ్య‌క్తి టీమిండియా జెర్సీని ధరించి పాక్‌ వర్గాలు మీ ఎత్తుగడలేంటని అడిగితే ఆ వ్యక్తి "క్షమించాలి. నేను ఆ విషయాలు చెప్పదల్చుకోలేదు" అని ముందుకు కదలగా అతని చేతిలోని టీకప్పును లాక్కుంటారు.

Story first published: Saturday, June 15, 2019, 13:29 [IST]
Other articles published on Jun 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+