For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహ్మద్ ఆమీర్‌కు నో ప్లేస్: వరల్డ్‌కప్‌లో ఆడే పాకిస్థాన్ జట్టిదే

ICC World Cup 2019: PCB names the Pakistan squad for the mega event

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న వన్డే వరల్డ్‌కప్ కోసం ఆయా దేశాలు వరుసగా జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా దేశాలు వరల్డ్ కప్ కోసం జట్లను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తాజాగా గురువారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మెగా టోర్నీలో పాల్గొనే మొత్తం 15 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. పాకిస్థాన్ ఛీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టుని ప్రకటించారు. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహారించనున్నాడు.

ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్‌ని వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ట్రెంట్ బ్రిడ్జి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. పాకిస్థాన్ జట్టులో పలువురి ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి.

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మహ్మద్ హఫీజ్ గాయపడ్డాడు. అయితే, పీసీబీ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో పాస్ కావడంతో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. పూర్తి ఫిట్‌గా ఉంటేనే హఫీజ్‌ను ఇంగ్లండ్‌కు పంపిస్తామని ఇంజమామ్‌ స్పష్టం చేశారు. పీసీబీ నిర్వహించిన యో-యో టెస్టులో 17.4 పాయింట్ల ప్రమాణికాన్ని ఇమాద్ వాసిం అందుకోలేకపోయాడు.

అయినప్పటికీ ఇమాద్ వాసింకు చోటు దక్కడం విశేషం. పాకిస్థాన్ ఛీఫీ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రకటించిన జట్టులో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌కు చోటు దక్కలేదు. గత కొన్నాళ్లుగా మహమ్మద్ ఆమీర్ పేలవ ప్రదర్శన కారణంగానే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

వరల్డ్‌కప్‌లో ఆడనున్న పాకిస్థాన్ జట్టు:
సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబిద్ అలీ, బాబర్ ఆజాం, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, హరీస్ సోహైల్, షాబాద్ ఖాన్, ఇమాద్ వాసిం, హసన్ అలీ, ఫహీమ్ అష్రప్, షహీన్ షా అఫ్రిది, జునైద్ ఖాన్, మహ్మద్ హన్సన్

Story first published: Friday, April 19, 2019, 14:08 [IST]
Other articles published on Apr 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+