
హైదరాబాద్: వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా శనివారం న్యూజిలాండ్-ఆప్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాంటన్ వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌లో రెండు విజయాలు, నాలుగు పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన ఉన్న న్యూజిలాండ్ జట్టు చిట్టచివరన ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడుతుండటం విశేషం.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వరుస విజయాలతో దూసుకెళుతున్న న్యూజిలాండ్ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌పై జరిగిన రెండో పోరులో తీవ్రంగా శ్రమించింది. రాస్ టేలర్ అద్భుత ఇన్నింగ్స్‌లో ఓటమి నుంచి బయటపడింది. రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, మన్రోలతో పాటు కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్‌తో టాపార్డర్ పటిష్టంగా ఉంది. మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గూసన్, నీషమ్‌తో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. మరోవైపు ఒకటి రెండైనా సంచలనాలు సృష్టిస్తుందని అంచనాలున్న గుల్బదిన్ నైబ్ సేన శ్రీలంకకు తేలిగ్గా తలొంచింది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కాస్త పోరాడింది.
{headtohead_cricket_95_4}
బౌలింగ్ బలంగా ఉన్నా, బ్యాటింగ్‌లో మంచి ఇన్నింగ్స్‌లు లేకపోవడంతో అఫ్గాన్ ఏమీ చేయలేకపోతోంది. దీనికితోడు ఓపెనర్ షెహజాద్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ఇక్రామ్ అలీ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు రషీద్ ఖాన్, నబీ, నైబ్‌పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.
జట్ల వివరాలు:
న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (సి), రాస్ టేలర్, టామ్ లాథం, జేమ్స్ నీషామ్, కోలిన్ డి గ్రాండ్హోమ్, మిట్చెల్ సాన్త్నెర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, టామ్ బ్లుండెల్, హెన్రీ నికోలస్, టిమ్ సౌతీ, ఇష్ సోడి.
ఆఫ్ఘనిస్తాన్: హజ్రూతల్లా జజాయ్, రహ్మాత్ షా, హష్మతుల్లా షహీడి, మొహమ్మద్ నబి, గుల్బాడిన్ నాయిబ్ (సి), ఇక్రమ్ అలీ ఖిల్ (w), నజీబుల్లా జద్రన్, రషీద్ ఖాన్, దౌలాత్ జాద్రన్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, అఫ్తాబ్ ఆలం, సాముల్లా షిన్వారీ, అస్ఘర్ ఆఫ్ఘన్, నూర్ అలీ జాద్రన్.
మ్యాచ్ ప్రారంభం సాయంత్రం 6 గంటలకు
స్టార్ స్పోర్ట్స్-3లో ప్రత్యక్ష ప్రసారం
లైవ్ స్ట్రీమింగ్: హాట్ స్టార్‌లో