ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది: ఓటమిపై న్యూజిలాండ్ ప్రధాని

హైదరాబాద్: ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ స్పందించారు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్ కూడా టై
ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు.

రెండో ప్రపంచకప్‌లో కూడా ఓటమి
దీంతో న్యూజిలాండ్ వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్లోనూ రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో కివీస్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ "ఒక దేశంగా చూస్తే, సూపర్ ఓవర్ సమయంలో ఎంతో ఉత్కంఠకు లోనయ్యాం. ఫైనల్ మ్యాచ్ ఎంతో అద్భుతంగా సాగింది. ఈ సూపర్ ఓవర్ పోరుతో మనం మరింత మెరుగయ్యాం" అని అన్నారు.
విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌కు అభినందలు
"విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌కు అభినందలు. మన జట్టును చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. జట్టుగా మీరు ఎంతో రాణించారు. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి మ్యాచ్‌ని నేను ఇంతకుమునుపెన్నడూ చూడలేదు. ఈ మెగా టోర్నీ సాంతం న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది" అని ఆమె అన్నారు.

ఫైనల్లో ఓడినా.. అభిమానుల హృదయాలను గెలిచిన న్యూజిలాండ్
కాగా, ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయినా... క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కాగా, బౌండరీల ఆధారంగా మ్యాచ్ విజేతను నిర్ణయించడంపై అటు అభిమానులతో పాటు, ఇటు మాజీలు సైతం ఐసీసీని విమర్శిస్తున్నారు. ఈ బౌండరీల నిబంధనను పునఃపరిశీలిచాలని కోరుతున్నారు.
{headtohead_cricket_2_4}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications