'టీమిండియా కప్ గెలవాలంటే ఆ ఇద్దరే కీలకం'

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా కూడా ఒకటి. ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు కప్పు గెలవాలంటే ఇద్దరు ఆటగాళ్లు కీలకం అవుతారని వెస్టిండిస్‌కు చెందిన మాజీ క్రికెటర్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
"నేను ఇద్దరు పేర్లను చెబుతున్నా. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా. ఈ ఇద్దరూ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్లుగా ఉపయోగపడతారు. భారత్‌కు ప్రపంచకప్ తెచ్చిపెట్టే సత్తా ఈ ఇద్దరికే ఉంది. ఇంగ్లాండ్ తన సొంత గడ్డపై ప్రపంచకప్ పోరులో దిగుతోంది. ఇటీవల వన్డేల్లోనూ ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడుతోంది" అని మైకెల్ హోల్డింగ్ అన్నాడు.

ఇంగ్లాండ్ జట్టు సమతూకంగా ఉంది
"ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు సమతూకంగా ఉంది. ఇక, భారత్ విషయానికి వస్తే అద్భుతం. నిలకడగా రాణిస్తున్నారు. జట్టులో మంచి ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈసారి ఇంగ్లాండ్ లేదా ఇండియా రెండింట్లో ఏ జట్టు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు" అని హోల్డింగ్ పేర్కొన్నాడు.

తొలిసారి ప్రపంచ విజేతగా భారత్
1983 ప్రపంచకప్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మోహిందర్ అమర్నాథ్ బౌలింగ్‌లో చివరి బ్యాట్స్‌మెన్‌గా హోల్డింగ్ ఔటయ్యాడు. దీంతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ఐదోసారి ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్
మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). అంతేకాదు సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు
యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.

రౌండ్ రాబిన్ పద్ధతిలో
1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, ఈ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications