Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాథ్యూస్, తిరుమన్నే హాఫ్ సెంచరీలతో తేరుకున్న శ్రీలంక

Century Partnership

హైదరాబాద్: లీడ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న శ్రీలంకను ఏంజెలో మాథ్యూస్-లాహిరు తిరుమన్నెల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఆచితూడి ఆడుతూ ఐదో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. 76 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో మాథ్యూస్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మాథ్యూస్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరోవైపు అతడికి మంచి సపోర్టు ఇస్తూ తిరుమన్నే కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.

66 బంతుల్లో 4 పోర్ల సాయంతో తిరుమన్నే సైతం హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం 36 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. క్రీజులో ఏంజెలో మాథ్యూస్(61), తిరుమన్నే(52) పరుగులతో ఉన్నారు. అంతకముందు జట్టు స్కోరు 17 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది.

నాలుగో ఓవర్‌లో ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నెను ఔట్ చేసిన బుమ్రా... ఎనిమిదో ఓవర్‌లో కుశాల్ పెరీరాను ఔట్ చేశాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ ఆదుకునే ప్రయత్నం చేయగా రవీంద్ర జడేజా బంతి అందుకున్న తొలి ఓవర్‌లోనే కుశాల్ మెండిస్(3)ను పెవిలియన్ పంపాడు.

జడేజా వేసిన 11వ ఓవర్ నాలుగో బంతిని ముందుకొచ్చి ఆడేందుకు కుశాల్ యత్నించగా ధోని స్టంపౌట్ చేశాడు. దీంతో 53 పరుగులకే శ్రీలంక మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండు పరుగులకే అవిష్క ఫెర్నాండో(20)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు.

Story first published: Saturday, July 6, 2019, 17:45 [IST]
Other articles published on Jul 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+