ICC World Cup 2019: కివీస్ vs శ్రీలంక వరల్డ్‌కప్ గణాంకాలివే

హైదరాబాద్: గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ శనివారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి కార్ఢిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొన్న 10 జట్లలో ప్రస్తుతం శ్రీలంక ఫామ్ పరంగా చెత్త జట్టు. అందుకు కారణం గత తొమ్మిది నెలల్లో లంకేయులు కేవలం రెండు వన్డేల్లో మాత్రమే విజయం సాధించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మరోవైపు న్యూజిలాండ్ ఈ టోర్నీలో గెలుపు గుర్రంగా బరిలోకి దిగుతోంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య గత వరల్డ్‌కప్‌ల్లో నమోదైన గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

వరుసగా 8 వన్డేల తర్వాత
1 - శ్రీలంక చివరగా స్కాట్‌లాండ్‌తో జరిగిన వన్డేలో విజయం సాధించింది. తద్వారా 8 వన్డేల వరుస ఓటముల తర్వాత శ్రీలంక గెలుపు రుచిని చూసింది.
1 - న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ టామ్ బ్లున్‌డెల్ టోర్నీలో పాల్గొనే పది జట్ల ఆటగాళ్లతో పోలిస్తే ఇంకా అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేయలేదు. కివీస్ తరుపున రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు.

కార్ఢిఫ్‌లో నాలుగు వన్డేల్లో ఓడిన శ్రీలంక
4 - కార్ఢిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో ఇంతకముందు శ్రీలంక ఆడిన నాలుగు వన్డేల్లోనూ ఓడిపోయింది. మరోవైపు ఇదే వేదికలో న్యూజిలాండ్ ఆడిన మూడు వన్డేల్లోనూ పరాజయం పాలైంది. దీంతో ఇరు జట్ల మధ్య ఈ పోరు ఆసక్తికరంగా మారింది.
4 - న్యూజిలాండ్‌తో ఆడిన గత 20 వన్డేల్లో శ్రీలంక కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. 2013 నుంచి ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో ఆడిన 20 వన్డేల్లో 13 వన్డేల్లో కివీస్ జట్టు నెగ్గగా... మూడు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో శ్రీలంకపై న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది.

కేన్ విలియమ్సన్ ఏడు హాఫ్ సెంచరీలు
7 - ఇంగ్లీషు గడ్డపై కేన్ విలియమ్సన్ ఆడిన గత ఏడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. 2015 నుంచి ఇంగ్లీషు గడ్డపై మొత్తం 8 వన్డేలాడిన కేన్ విలియమ్సన్ 80 యావరేజితో 640 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
147 - న్యూజిలాండ్ తరుపున 79 వన్డేల్లో ట్రెంట్ బౌల్ట్ 147 వికెట్లు తీశాడు. తను ఆడబోయే రెండ వన్డేల్లో బౌల్ట్ రెండు వికెట్లు తీస్తే న్యూజిలాండ్ తరుపున అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో బౌలర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు.

విలియమ్సన్-టేలర్ మూడు సెంచరీ భాగస్వామ్యాలు
747 - 2015 నుంచి ఇప్పటివరకు ఇంగ్లీషు గడ్డపై ఆడిన మ్యాచ్‌ల్లో విలియమ్సన్, రాస్ టేలర్‌లు మూడో వికెట్‌కు 106.71 యావరేజితో 747 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి జోడీ గత ఆరు భాగస్వామ్యాల్లో 80కి పైగా పరుగులు నమోదు చేశారు. ఇందులో మూడు సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి.
2015 - గత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో కూడా శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. గత ఆరు వరల్డ్ కప్ ఎడిషన్లలో శ్రీలంకపై విజయం సాధించడం న్యూజిలాండ్‌కి ఇదే తొలిసారి. అంతకముందు న్యూజిలాండ్ జట్టు శ్రీలంక చేతిలో వరుసగా ఐదు సార్లు ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications