
అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్
1 - భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ(358 సిక్సర్లు) చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(355)ని వెనక్కి నెట్టాడు.
1 - ప్రపంచ కప్‌లో పాక్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు (336/5). ఇదే టోర్నీలో ఇంగ్లండ్ (334/9) నమోదు చేసిన రికార్డును భారత్ సవరించింది.
2 - భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ (340)ను వెనక్కి నెట్టి ధోనీ(341) రెండో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (463) అగ్రస్థానంలో ఉన్నాడు.

రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ
2 - ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2015లో విరాట్ కోహ్లీ (107) తొలి సెంచరీని నమోదు చేశాడు.
3 - ప్రపంచకప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన మూడో బౌలర్‌గా విజయ్ శంకర్ అరుదైన ఘనత సాధించాడు. గతంలో హార్వే (ఆస్ట్రేలియా; పాక్‌పై 2003లో), మలాచీ జోన్స్ (బెర్ముడా; భారత్‌పై 2007లో) ఈ ఘనత సాధించారు.
3 - పాక్‌పై వేగంగా సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్(85 బంతులు) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో సెహ్వాగ్(80, 84 బంతులు) ఉన్నాడు.

నాలుగో భారత బ్యాట్స్‌మన్
4 - ప్రపంచకప్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. 1987లో సిద్ధు, 1996లో సచిన్ టెండూల్కర్, 2011లో యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు.
9 - వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో క్రికెటర్ విరాట్ కోహ్లీ. సచిన్, గంగూలీ తర్వాత భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు.
24 - వన్డేల్లో రోహిత్ శర్మ సాధించిన సెంచరీలు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకి ఇది రెండో సెంచరీ.

వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ
34 - ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేయడానికి రోహిత్ శర్మకు అవసరమైన బంతులు. వన్డేల్లో అతడికిదే వేగవంతమైన హాఫ్ సెంచరీ.
136 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. సచిన్-సిద్ధు 90 పరుగుల (1996లో) రికార్డు ఈ మ్యాచ్‌లో బద్దలైంది.
140 - పాక్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. విరాట్ కోహ్లీ(107), సయిద్ అన్వర్(101) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
319 - ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ చేసిన పరుగులు. రోహిత్ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ మెగా టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఆరోన్ ఫించ్ (343) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications












