పీటర్సన్ ట్వీట్ వైరల్: పాంటింగ్ 'గ్రేట్' ఆస్ట్రేలియా జట్టుతో ఇంగ్లాండ్‌కు పోలిక

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుపై ఆ దేశ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టుని పీటర్సన్ రికీ పాంటింగ్ నాయకత్వంలోని 'గ్రేట్' ఆస్ట్రేలియా జట్టుతో పోల్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
పీటర్సన్ తన ట్విట్టర్‌లో "ప్రస్తుత ఇంగ్లాండ్ వన్డే జట్టు గ్రేట్ ఆస్ట్రేలియా జట్టుని తలపిస్తోంది" అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు తన ట్వీట్‌లో ఆసీస్ మాజీ బ్యాటింగ్ దిగ్గజాలైన హెడెన్, పాంటింగ్, గిల్‌క్రిస్ట్‌లతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్‌లను పోల్చాడు.

పాంటింగ్ నాయకత్వంలో రెండు సార్లు
రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు రెండు సార్లు వన్డే వరల్డ్‌కప్‌ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2003, 2007 వరల్డ్‌కప్‌ల్లో హెడెన్, పాంటింగ్, గిల్‌క్రిస్ట్‌లు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో పాంటింగ్ సేన టీమిండియాను ఓడించగా... 2007లో శ్రీలంకపై విజయం సాధించింది.

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.

ఆతిథ్య జట్టు ఫేవరేట్‌గా బరిలోకి
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ కావడంతో ఆతిథ్య జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకుల్లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications