సరైన నిర్ణయం: ఆఖరి క్షణంలో ఆరోన్ ఫించ్ డీఆర్ఎస్ కాల్

హైదరాబాద్: టాంటన్ వేదికగా బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ చివరి క్షణంలో తీసుకున్న డీఆర్‌ఎస్ నిర్ణయాన్ని మాజీ ప్లేయర్లు కెవిన్ పీటర్సన్, అనిల్‌కుంబ్లేలు ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అనంతరం ఆసీస్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. దీంతో విజయం పాకిస్థాన్‌దే అని అనుకున్నారంతా. ఈ సమయంలో ఇమాముల్(53), హఫీజ్(46), మాలిక్(0), అసిఫ్ అలీ(5)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో పాకిస్థాన్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడింది.

బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం
ఈ దశలో కెప్టెన్ సర్ఫరాజ్‌తో కలిసి బౌలర్ వాహబ్ రియాజ్ విజయం కోసం పోరాడాడు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించిన తర్వాత వాహబ్(45)ను స్టార్క్ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే, వాహబ్ రియాజ్ విషయంలో ఆసీస్ కెప్టెన్ ఫించ్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

పీటర్సన్ మాట్లాడుతూ
దీనిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ "మేం ఆట చూస్తూనే ఉన్నాం. ఆరోన్ ఫించ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లాలని బలంగా కోరుకున్నాం. ఆటగాళ్లు కాదన్నప్పటికీ ఆఖరి క్షణంలో డీఆర్ఎస్‌కు వెళ్లాలని ఫించ్ నిర్ణయం తీసుకోవడం ఆసీస్‌కు కలిసొచ్చింది" అని అన్నాడు. ఇక, కుంబ్లే సైతం ఫించ్ డీఆర్ఎస్ కాల్‌పై "బంతి బ్యాట్‌కు తగిలాక రియాజ్ కీపర్ వైపు చూశాడు. కాబట్టి అతడు కచ్చితంగా ఔటయ్యే ఉంటాడని అర్థం" అని తెలిపాడు.

అసలేం జరిగింది?
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వాహబ్ రియాజ్ ఆడిన బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి వికెట్ కీపర్ ఆలెక్స్ కారే చేతిలో పడింది. వెంటనే బౌలర్ అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ సమయంలో ఆరోన్ ఫించ్ డీఆర్ఎస్ నిర్ణయంపై కాసేపు ఆటగాళ్లతో చర్చించి... 14వ సెకనులో రివ్యూకు వెళ్లాడు.

ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే
ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే డీఆర్‌ఎస్ కోరే అవకాశాన్ని ఫించ్ కోల్పోయేవాడు. రివ్యూలో అతడు ఔట్‌గా తేలడంతో అంఫైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత రెండు పరుగులకే చివరి రెండు వికెట్లు కోల్పోవడంతో 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications