ధోని, కోహ్లీ కెప్టెన్సీలో ఉన్న తేడా అదే

హైదరాబాద్: భారత జట్టుకు బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు. అయితే, ధోని తన కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో వారసుడిగా విరాట్ కోహ్లీని బోర్డు ఎంపిక చేసింది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా కూడా అద్భుత విజయాలను నమోదు చేస్తూ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, కెప్టెన్సీ విషయానికి వస్తే ధోని తీరు ఒకలా ఉంటుందని, విరాట్ కోహ్లీ తీరు మరోలా ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అన్నాడు. గేమ్‌ను మానసికంగా కంట్రోల్ చేయడంలో ధోని దిట్ట అయితే, కోహ్లీ ప్రతి మ్యాచ్‌లోనూ తన మార్క్‌ని చూపిస్తాడని చెప్పుకొచ్చాడు.
మే 30నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇద మొదటి వరల్డ్‌కప్. దీంతో ఈ మెగా టోర్నీలో కెప్టెన్‌గా భారత జట్టుని ఎలా నడిపిస్తాడనే ఆందోళనలో కొందరు అభిమానులు ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో ధోని, కోహ్లీ కెప్టెన్సీపై రోడ్స్ మాట్లాడాడు.

ఫిట్‌నెస్ విషయంలో ధోని
"ఫిట్‌నెస్ విషయంలో గేమ్‌ను కంట్రోల్ చేసే విషయంలో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ జట్టును ముందుకు నడిపే వాళ్లకు ధోనినే చక్కటి ఉదాహరణ. కోహ్లీ, ధోనీల కెప్టెన్సీలో ఎన్నో తేడాలున్నాయి. కోహ్లీ ప్రతి మ్యాచ్‌లోనూ తన మార్క్ చూపిస్తాడు. ధోనీ ఇటు కెప్టెన్‌గా, అటు ఆటగాడిగానూ మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు" అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు.

2004లో అరంగేట్రం చేసిన ధోని
2004లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ధోని అనేక టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ధోని నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ నిర్వహించే మూడు ప్రధాన ట్రోఫీలను కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా ధోని భారత్‌కు టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాడు. తాజాగా కోహ్లీ కూడా ధోనీ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

కోహ్లీ మాట్లాడుతూ
ఇటీవలే ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ మాట్లాడుతూ "విధేయత అనేది చాలా ముఖ్యం. నేను జట్టులోకి వచ్చిన కొత్తలో పెద్దగా ఆకట్టుకోలేదు. నన్ను కాదని వేరొకరిని ప్రయత్నించే అవకాశం ఉన్నా, మహీభాయ్ ఆ పని చేయలేదు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో రాణించా. కానీ, ప్రారంభంలో ఇబ్బంది పడుతున్న సమయంలో నా వెన్నంటే నిలిచాడు. అది నాకు చాలా ఉపయోగపడింది" అని అన్నాడు.

మూడో నంబర్‌లో అవకాశమిచ్చింది ధోనినే
"మూడో నంబర్‌లో అవకాశమిచ్చింది కూడా ధోనినే. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్లు ధోనీకి ఆటపై గొప్ప అవగాహన ఉంది. తొలి బంతి నుంచి 50 ఓవర్లు పూర్తయ్యేవరకు ప్రతీ బంతిని దగ్గరగా గమనిస్తాడు. ధోని జట్టులో ఉండడం నాకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పను. స్టంప్స్ వెనుక అతడి లాంటి తెలివైన వ్యక్తి ఉండడం నా అదృష్టమని చెబుతా. టీమ్ మేనేజ్‌మెంట్‌తో వ్యూహరచనలో మహీ భాయ్, రోహిత్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటా" అని అన్నాడు.

ధోనీ నుంచి విలువైన సలహాలు స్వీకరిస్తా
"మ్యాచ్‌కు సంబంధించిన చాలా విషయాల్లో ధోనీ నుంచి విలువైన సలహాలు స్వీకరిస్తా. అందుకే మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. చివరి ఓవర్లలో ఎక్కువగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటా. అలా ఉండడం నా స్వభావం. 30-35 ఓవర్లు ముగిసేసరికి నేను వెనక్కి వెళ్లిపోతానని మహీకి తెలుసు. అది సహజంగా జరిగేదే. ఆ సమయంలో ధోనీయే అన్నీ చూసుకుంటాడు. అందుకే మా మధ్య పరస్పర గౌరవం, నమ్మకం ఉంది" అని ధోని కెప్టెన్సీలోనే తానెంతో నేర్చుకున్నానని, జట్టుకు ధోని సలహాలు సూచనలు అవసరమని కోహ్లీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications