న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'తన పేస్‌తో ప్రత్యర్ధి జట్టుని బుమ్రా కాల్చేస్తాడు'

ICC Cricket World Cup 2019 : Jasprit Bumrah Can Burn Opposition With Pace, Says Jeff Thomson
ICC World Cup 2019: Jasprit Bumrah can burn opposition with pace, says Jeff Thomson

హైదరాబాద్: ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సఫారీ పేసర్ కగిసో రబాడలు పరిస్థితులకు తగ్గట్లు చెలరేగుతారని జెఫ్‌ థామ్సన్‌ అభిప్రాయపడ్డాడు. బుమ్రా తన వేగంతో ప్రపంచంలోని అత్యుత్తమ బాట్స్‌మెన్‌‌కు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో జెప్ థామ్సన్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

"బుమ్రా అద్బుత ప్రదర్శన చేస్తున్నాడు. శక్తికి మించి బంతులు వేస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ను కూల్చేసే వేగం అతడి బౌలింగ్‌కు ఉంది. బుమ్రా బౌలింగ్‌లో అటు పేస్‌తో పాటు వేగం కూడా ఉండటంతో అతడి బౌలింగ్‌ను అధ్యయనం చేయడం కష్టం. అతడి బౌలింగ్‌ను చదివిన బ్యాట్స్‌మన్‌ను నేనిప్పటికీ చూడలేదు" అని అన్నాడు.

"అతడొక అనార్తడాక్స్. అదే బుమ్రాని భిన్నంగా కనిపించేలా చేస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో బుమ్రాతో పాటు రబాడ బౌలింగ్‌ను చూడాల్సి ఉంది. విపత్కర పరిస్థితుల్లో వీరిద్దరూ రాణించగలరు. మిచెల్‌ స్టార్క్‌ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. స్టార్క్ గనుక ఫామ్‌ని అందిపుచ్చుకుంటే అతడిని మించిన బౌలర్ లేడు" అని జెఫ్ థామ్సన్ తెలిపాడు.

"ఆసీస్‌ బౌలింగ్‌లో అతడే కీలకం. గతంలో ఆసీస్‌కు ఆనేక అద్భుత విజయాలను కట్టబెట్టాడు. ఇక, కమిన్స్‌తో ఎలాంటి సమస్య లేదు. అతడిలో టాలెంట్ ఉంది" అని జెఫ్ థామ్సన్ చెప్పుకొచ్చాడు. 1970ల్లో మాల్కమ్‌ మార్షల్‌తో పాటు జెఫ్‌ థామ్సన్‌ను ప్రపంచంలోనే ఫాస్ట్ బౌలర్‌గా పరిణించేవారు.

Story first published: Tuesday, May 21, 2019, 13:17 [IST]
Other articles published on May 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X