Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌండరీ లైన్ వద్ద చాహల్ 'చిల్లింగ్' పిక్: సోషల్ మీడియాలో నెటిజన్ల జోకులు

ICC World Cup 2019, India Vs Sri Lanka: Yuzvendra Chahal’s ‘chilling’ pic gets meme treatment, the results are hilarious

హైదరాబాద్: ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు సెంచరీలతో చెలరేగడంతో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో కోహ్లీసేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫలితంగా టోర్నీలో భాగంగా మంగళవారం టీమిండియా ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనున్న తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో తలపడనుంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా తమ ఆటతో చెలరేగి అభిమానుల మనసు దోచితే... ఈ మ్యాచ్‌లో ఆడని చైనామన్ చాహల్‌ సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ సమయంలో యజువేంద్ర చాహల్ భారత ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్‌ అందిస్తూ కనిపించాడు. మ్యాచ్ మధ్యలో బౌండరీ లైన్‌ వద్ద సేదతీరుతూ కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు ఫన్నీ మీమ్స్‌ జోడించి నెటిజెన్లు జోకులు వేస్తున్నారు.

లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లీగ్ స్టేజిలో ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించిన కోహ్లీసేన 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Story first published: Monday, July 8, 2019, 13:45 [IST]
Other articles published on Jul 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+