Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమానులకు నిరాశే!: భారత్-కివీస్ మ్యాచ్‌పై లేటెస్ట్ అప్‌డేట్

ICC World Cup 2019, India vs New Zealand Live Score: Absolutely pouring now... this game is not happening

హైదరాబాద్: టీమిండియా అభిమానులకు చేదువార్త. నాటింగ్‌హామ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు పడాల్సిన టాస్ వర్షం కారణంగా ఆలస్యమైనన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురస్తుండటంతో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. గురువారం మధ్యాహ్నాం ఒంటి గంట వరకు అక్కడ భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత చిరు జల్లులు కురవడం మొదలైంది. ఈ నేపథ్యంలో పిచ్‌పై కవర్లు అలాగే కప్పి ఉంచారు. వర్షం దోబూచులాడటంతో అంపైర్లు మైదానంలోకి వెళ్లి పిచ్‌ని పరిశీలిస్తున్నారు.

ఆ తర్వాత మళ్లీ చిరు జల్లులు కురవడం మొదలైంది. ఈ నేపథ్యంలో పిచ్‌పై కవర్లు అలాగే కప్పి ఉంచారు. వర్షం ఆగినప్పటికీ మైదానంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. పిచ్‌పై కవర్లను కప్పారు. దీంతో సూపర్లతో నీటిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారింది.

వర్షం ఒక గంట ఆగిపోతే కవర్లు తొలగించి పిచ్‌ను సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది. మరోసారి అంఫైర్లు పిచ్‌ని పరిశీలించి ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేసి టాస్‌పై నిర్ణయం తీసుకుంటారు. తాజాగా, ఆరు గంటల తర్వాత మళ్లీ వర్షం పడుతుండటంతో ఈ మ్యాచ్ కూడా రద్దయ్యేలా కనిపిస్తోంది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, June 13, 2019, 18:39 [IST]
Other articles published on Jun 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+