
హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సాధిచండంతో వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో శిఖర్ ధావన్ సెంచరీ సాధించడంతో భారత్ 27వ వరల్డ్‌కప్ సెంచరీని ఖాతాలో వేసుకుంది. తద్వారా ఈ జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది.
వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్ల జాబితాలో భారత్(27 సెంచరీలు) తొలి స్థానానికి చేరగా, ఆస్ట్రేలియా(26 సెంచరీలు) రెండో స్థానంలో ఉంది. శ్రీలంక(23), వెస్టిండీస్(17), న్యూజిలాండ్(15)లు తర్వాత వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆపై దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్(14 సెంచరీలు)లు సంయుక్తంగా ఉన్నాయి.
వన్డేల్లో శిఖర్ ధావన్‌కి ఇది 16 సెంచరీ కాగా... ఆస్ట్రేలియాపై మూడోది కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 109 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 117 పరుగులతో సెంచరీ సాధించాడు.
వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీ చేసిన దేశాలు:
* 27 - టీమిండియా
26 - ఆస్ట్రేలియా
23 - శ్రీలంక
17 - వెస్టిండిస్
15 - న్యూజిలాండ్
14 - ఇంగ్లాండ్/పాకిస్థాన్/ ఇంగ్లాండ్
ఆసీస్‌కు 353 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. తొలి ఏడు ఓవర్ల నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు... ఆ తర్వాత ధావన్ పరుగుల వరద పారించాడు. కౌల్టర్ నైల్ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్లు ధావన్ 14 పరుగులు పిండుకున్నాడు.
ఆ తర్వాత నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరొవైపు రోహిత్ శర్మ అతడికి సహకారం అందిస్తు హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోడీ 127 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రోహిత్ శర్మ(57) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో కలిసిన ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఆసీస్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని ధావన్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 16వ వన్డే సెంచరీ. ఆ తర్వాత జట్టు స్కోరు 220 పరుగుల వద్ద శిఖర్ ధావన్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో హార్దిక్ పాండ్యా మూడో వికెట్‌గా ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన ధోని 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించి నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆఖరి ఓవర్‌లో స్కోరును పెంచే క్రమంలో కోహ్లీ(82) పరుగుల వద్ద ఔట్ కాగా, కేఎల్ రాహుల్ 3 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ కొట్టడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ రెండు వికెట్లు సాధించగా, కమిన్స్, స్టార్క్, కౌల్టర్ నైల్‌లకు తలో వికెట్ లభించింది.
{headtohead_cricket_1_3}