
హైదరాబాద్: ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా మరో సమరానికి సన్నద్ధమైంది. సౌతాంప్టన్ వేదికగా పసికూన ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహ్మద్ షమీని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు కోహ్లీ చెప్పాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా వేసిన యార్కర్‌కు గాయపడ్డ విజయ్ శంకర్ కోలుకోవడంతో అతన్నే తుది జట్టులో కొనసాగించాలని టీమిండియా యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఆప్ఘన్‌తో జరిగే మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు ఆడే అవకాశం దక్కలేదు. మరోవైపు అప్ఘనిస్థాన్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి.
అఫ్తాబ్ ఆలం, హజ్రతుల్లా జజాయ్‌ని ఎంపిక చేసినట్లు ఆ జట్టు కెప్టెన్ గుల్బదిన్ నైబ్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ రేసులో మరింత ముందుకెళ్తుంది. ముఖాముఖి పోరు విషయానికి వస్తే రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు వన్డేలే జరిగాయి.
అవి కూడా 2014, 2018 ఆసియా కప్‌లలో భాగంగానే జరికాయి. వీటిలో భారత్ ఒక మ్యాచ్ విజయం సాధించగా మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా ఆప్ఘన్ ఆఖరి స్థానంలో ఉంది.
జట్ల వివరాలు:
టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా .
అఫ్గానిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, రెహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, అస్ఘర్ అఫ్గాన్, మహమ్మద్ నబి, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, అఫ్తాబ్ అలమ్, నిజాబుదుల్లా జద్రాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.