వరల్డ్‌కప్: 'ఆల్‌రౌండర్‌గా జడేజా వద్దు... విజయ్ శంకర్ అర్హుడు'


హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా జడేజా వద్దని, అతడి స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేయాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోందని గంగూలీ కొనియాడాడు. హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, కేదార్ జాదవ్‌ల రూపంలో భారత జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండగా వరల్డ్‌కప్ లాంటి టోర్నీకి జడేజా అక్కర్లేదని గంగూలీ స్పష్టం చేశాడు.

ధోని పరుగులు చేసినంత కాలం ఆడితే తప్పేమీలేదు
అంతేకాదు వరల్డ్ కప్ తర్వాత కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌లో కొనసాగొచ్చని, పరుగులు చేసినంత కాలం ఆడితే తప్పేమీలేదని అన్నాడు. గంగూలీ మాట్లాడుతూ "ప్రపంచకప్ తర్వాత కూడా ధోని ఆడొచ్చు. భారత్ కప్పు గెలిచి, ధోని బాగా ఆడితే ఎందుకు క్రికెట్‌కు వీడ్కోలు కావాలి. ప్రతిభ ఉన్నంత వరకూ వయసు అడ్డంకి కాదు. భారత పేస్ దాడి బాగుంది. షమి, బుమ్రాలు నిలకడగా రాణిస్తున్నారు. ప్రపంచకప్‌లో పేసర్లు కీలక పాత్ర పోషించనున్నారు" అని అన్నాడు.

ఓపెనర్లుగా రోహిత్-ధావన్ జోడీ అదుర్స్
ఇక, ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడి కుదురుకుందని... వారి జోడీని విడగొట్టద్దు అని గంగూలీ సూచించాడు. "రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి ఓపెనర్ జోడీ. రాహుల్ సైతం అందుబాటులో ఉండటం మంచిదే. విరాట్ కోహ్లీ ఎప్పుడూ విరాట్ కోహ్లీనే. అతడు కచ్చితంగా మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలి" అని గంగూలీ అన్నాడు.

నాలుగులో రాయుడు, ఐదులో ధోని రావాలి
"నాలుగులో రాయుడు, ఐదులో ధోని, ఆరులో జాదవ్ రావాలి. నాగ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో విజయ్ శంకర్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ప్రపంచకప్ జట్టులో ఉండేందుకు అతడు అర్హుడు. రవీంద్ర జడేజా ప్రపంచకప్ జట్టులో తీసుకోకుండా ఉంటే మంచిది" అని గంగూలీ జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. భారత్ ఫేవరెట్‌గా ఆడుతున్నా.. శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్‌లు సైతం వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేస్తాయని గంగూలీ అన్నాడు. అన్ని జట్లూ రేసులో ఉండటంతో ఈ వరల్డ్‌కప్ ఎంతో ఆసక్తికరంగా మారిందని గంగూలీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications