Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీమా కంపెనీల ఆవేదన: మ్యాచ్ రద్దయితే 100 కోట్లు చెల్లించాల్సిందే

ICC World Cup 2019: Indias Washed-out Matches May Cost Insurers Rs 100 Crore

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌కు వరుణుడు అంతరాయం కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్ఫణం అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే మిగతా మ్యాచ్‌లకు వర్షం ఆటకం కలిగించొద్దని క్రికెట్‌ అభిమానులతో పాటు బీమా సంస్థలు సైతం భగవంతుడిని వేడుకుంటున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌కు ముందు టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు వర్షార్పణం కాకుండా ఉండాలని బీమా కంపెనీలు కోరుకుంటున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితే బీమా సంస్థలు రూ.100 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి!

భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి!

జూన్ 16న భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. భారత ఇన్నింగ్స్‌ సమయంలో వర్షం పడటంతో కాసేపు మ్యాచ్‌ని నిలిపివేశారు. టోర్నీకే హై ఓల్డేజ్ మ్యాచ్‌ కావడంతో ఈ మ్యాచ్ నిలిచిపోతే తమ పరిస్థితి ఏంటని బీమా కంపెనీలు తలలు పట్టుకున్నాయి.

మ్యాచ్‌ సజావుగా సాగటంతో

మ్యాచ్‌ సజావుగా సాగటంతో

అయితే, ఆ తర్వాత వర్షం తగ్గడం... మ్యాచ్‌ సజావుగా సాగటంతో అభిమానులతో పాటు బీమా కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. భారత్‌-పాక్ మ్యాచ్‌కు సంబంధించి బీమా కవరేజీ రూ.50 కోట్లుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భారత మార్కెట్‌ ఆధారంగా మొత్తం రూ.150 కోట్ల వరకు రిస్క్ కవరేజి ఉన్నట్లు సమాచారం.

టోర్నీలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా

టోర్నీలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా

ఈ మొత్తాన్ని బీమా దిగ్గజ సంస్థలైన న్యూ ఇండియా అష్యూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, ఐసీఐసీఐ లొంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు బీమా కవరేజీని ఇచ్చిన జాబితాలో ఉన్నాయి. టోర్నీలో భాగంగా టీమిండియా మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

రూ.100 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి

రూ.100 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి

ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షార్పణం కావటంతో బీమా కంపెనీలు పెద్ద మొత్తాన్ని చెల్లించాయి. మ్యాచ్‌లు రద్దయితే ఐసీసీ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను దక్కించుకున్న బ్రాడ్‌కాస్టర్స్‌కు బీమా కంపెనీలు.. క్లెయిమ్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో జరిగే మ్యాచ్‌లు వర్షం కారణంగా నిలిచిపోతే రూ.100 కోట్లు చెల్లించాల్సి వస్తుందని బీమా కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి.

Story first published: Monday, June 24, 2019, 13:25 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+