Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫించ్ హాఫ్ సెంచరీ: నెట్ బౌలర్ కిషన్‌‌కు ఆస్ట్రేలియా టీషర్ట్ ఇచ్చిన వార్నర్

ICC World Cup 2019 in London: Australia vs Sri Lanka Live Cricket Score: Finch Completes Half-century

హైదరాబాద్: ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తిసార పెరీరా వేసిన ఓవర్‌లో సింగిల్ తీసి 53 బంతుల్లో ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ఫించ్‌కు ఇది 24వ హాఫ్‌ సెంచరీ కావడం విశేషం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించింది. మ్యాచ్ ఆరంభంలో నిలకడగా ఆడిన ఆసీస్ ఓపెనర్లు ఆ తర్వాత జోరు పెంచి దూకుడుగా ఆడారు. డేవిడ్ వార్నర్ నిదానంగా ఆడుతుంటే ఫించ్ మాత్రం లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు.

వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత డేవిడ్ వార్నర్ 48 బంతుల్లో 26(2 ఫోర్లు) ధనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా(10) జట్టు స్కోరు 100 పరుగుల వద్ద ధనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఉదానకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆసీస్ కోల్పోయిన రెండు వికెట్లూ డిసిల్వా ఖాతాలోకే చేరాయి. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్(69), స్టీవ్ స్మిత్(9) పరుగులతో ఉన్నారు.

1
43664

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కి ముందు నెట్ సెషన్‌లో డేవిడ్ వార్నర్ కొట్టిన బంతి నెట్ బౌలర్ జై కిషన్ తలకు బలంగా తాకడంతో కిషన్‌ మైదానంలోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే కిషన్‌కు ఆస్ట్రేలియా సహాయక బృందంతో పాటు మైదానం సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు డేవిడ్ వార్నర్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫాస్ట్‌ బౌలర్ (నెట్ బౌలర్) జై కిషన్‌ను కలిశాడు. ఈ సందర్భంగా అతడు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ... ఆసీస్ ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీని అందించాడు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కి ముందు నెట్ సెషన్‌లో డేవిడ్ వార్నర్ కొట్టిన బంతి నెట్ బౌలర్ జై కిషన్ తలకు బలంగా తాకడంతో కిషన్‌ మైదానంలోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.

వెంటనే కిషన్‌కు ఆస్ట్రేలియా సహాయక బృందంతో పాటు మైదానం సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి మెరుగైన చికిత్స అందించారు. తాజాగా, అతడు గాయం నుంచి కోలుకోవడంతో శనివారం శ్రీలంకతో మ్యాచ్ జరగడానికి ముందు డేవిడ్ వార్నర్‌ను కలిశాడు.

{headtohead_cricket_1_7}

Story first published: Saturday, June 15, 2019, 17:02 [IST]
Other articles published on Jun 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+